ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ.
సంగారెడ్డి : నేడు సిగాచి పరిశ్రమకి సీఎం రేవంత్ రెడ్డి. పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో పరిశ్రమలో గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి. అనంతరం ప్రమాద స్థలిని పరిశీలించనున్న సీఎం రేవంత్.
నేడు తెలంగాణ గ్రూప్-1 పిటిషన్లపై విచారణ. TGPSC నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ. పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ నంబర్ల మార్పిడి, పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియలో అవకతవకలు వంటి అక్రమాలు జరిగాయని.. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పిటిషన్లు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక. నూతన సారథిగా రాంచందర్‌రావు నేడు అధికారిక ప్రకటన. కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడి దాకా. 4 దశాబ్దాల్లో అంచెలంచెలుగా ప్రస్థానం. విద్యార్థి నేతగా రాడికల్స్‌తో పోరు.
నంద్యాల: నేటి నుండి శ్రీశైలం మల్లన్న భక్తులకు ఉచిత స్పర్శ దర్శనం. సామాన్య భక్తులకు వారంలో 4 రోజులు ఉచిత స్పర్శదర్శనం. నేటి నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.45 గంటల వరకు ఉచిత స్పర్శదర్శనం.
అమరావతి: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టిఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. వ్వూరు నియోజకవర్గం..మలకపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు పెన్షన్ పంపిణీ..
ఇవాళ వైసీపీ యువజన విభాగం సభ్యులతో మాజీ సీఎం వైయస్ జగన్ సమావేశం.. తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం ప్రతినిధులతో సమావేశం కానున్న జగన్.. సమావేశానికి హాజరుకానున్న యువజన విభాగం రాష్ట్ర సభ్యులు, పార్టీ ముఖ్య నేతలు.. యువతకు కూటమి సర్కార్ ఇచ్చిన హామీల అమలు వాటి వైఫల్యాలపై మరో పోరాటానికి సిద్ధం చేసే దిశగా జగన్ ప్రణాళికలు..
అమరావతి : ఇవాళ ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన. ఎప్పటికే లాంఛనంగా మారిన ప్రకటన. నామినేషన్ వేసిన పి.వి.ఎన్.మాధధవ్. 10.45కు అధ్యక్షుని ప్రకటన.. అనంతరం పదవీ ప్రమాణం, బాధ్యతల స్వీకరణ.
నంద్యాల : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో : 1,00,085 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో : నిల్. పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు. ప్రస్తుతం : 874.30 అడుగులు. పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.7080 టీఎంసీలు. ప్రస్తుతం : 160.5282 టీఎంసీలు. కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి.
కామారెడ్డి: నేటి నుంచి ఆగస్టు 31వరకు నిజాం సాగర్ జలాశయంలో చేపల వేట నిషేధం. వర్షా కాలం లో చేపల సంతాన ఉత్పత్తి జరుగుతుందని ఎవరు చేపలు పట్టరాదని అధికారుల ఆదేశం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న మత్స్యశాఖ.