Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
- పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావంతో కేంద్రం కీలక నిర్ణయం
- ఫోర్స్ మేజ్యూర్ కింద ప్రాజెక్టులకు గడువు పొడిగింపు
- ఫిబ్రవరి 28, 2026 తర్వాతి ప్రాజెక్టులకు వర్తింపు
- బిల్డర్లు, గృహ కొనుగోలుదారులకు భారీ ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana RERA : పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా తాకింది. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ఈ ఉద్రిక్తతల కారణంగా నిర్మాణ సామగ్రి కొరత ఏర్పడటమే కాకుండా సరఫరా గొలుసులు (సప్లై చైన్) తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో నిర్మాణాలు అనుకున్న సమయానికి పూర్తికాక జాప్యం జరుగుతుండటాన్ని గమనించిన కేంద్ర గృహనిర్మాణ , పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక అడ్వైజరీని విడుదల చేసింది. ఈ అనూహ్య పరిస్థితులను ‘ఫోర్స్ మేజ్యూర్’ (Force Majeure)గా ಪರಿగణించాలని సూచించిన కేంద్రం, RERA చట్టంలోని సెక్షన్-6 ప్రకారం అర్హత కలిగిన ప్రాజెక్టులకు నాలుగు నెలల పాటు రిజిస్ట్రేషన్ గడువును పొడిగించాలని రాష్ట్ర RERA అథారిటీలకు స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా, గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు ప్రాజెక్టులను సజావుగా పూర్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ RERA (T-RERA) కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 28, 2026 లేదా ఆ తర్వాత పూర్తికావాల్సిన అన్ని తెలంగాణ RERA నమోదిత రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు నాలుగు నెలల గడువు పొడిగింపును వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల బిల్డర్లకు నిర్మాణ పనులను పూర్తి చేయడానికి అదనపు సమయం లభించడమే కాకుండా, కొనుగోలుదారులకు తమ ఇళ్ల నిర్మాణ నాణ్యత దెబ్బతినకుండా సకాలంలో అందే అవకాశం కలుగుతుంది. దీనికోసం డెవలపర్లు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా, సంబంధిత RERA అథారిటీలే సాధారణ ఉత్తర్వుల (General Orders) ద్వారా ఈ గడువు పొడిగింపును అమలు చేయనున్నాయి.
Also Read
తాజావార్తలు
-
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!