Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Jagtial Warning Letter Of Maoists In Jagitya Huge Encounter In Kottagudem

Maoist: జగిత్యాలలో మావోయుస్టుల వార్నింగ్‌ లెటర్‌.. కొత్తగూడెంలో భారీ ఎన్‌కౌంటర్..

Published Date :May 7, 2023 , 9:53 am
By NTV WebDesk
Maoist: జగిత్యాలలో మావోయుస్టుల వార్నింగ్‌ లెటర్‌.. కొత్తగూడెంలో భారీ ఎన్‌కౌంటర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Maoist: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల హెచ్చరిక లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో మావోయిస్టుల పేరుతో ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ లేఖలు రావడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో ప్రజాప్రతినిధులకు గుర్తుతెలియని వ్యక్తులు హెచ్చరిక లేఖలు పంపారు. జగిత్యాల జిల్లాలోని ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో రాసిన లేఖలు పోస్టులో వచ్చాయి. జిల్లాలోని బీర్‌పూర్ మండల సర్పంచ్‌లు, ఎంపీపీ, నరసింహుల పల్లి ఎంపీటీసీలతో పాటు పలువురు కీలక నేతలు మావోయిస్టుల పేరుతో మొత్తం 28 మందికి ఈ లేఖలు రాశారు. అయితే మండలంలో కొందరు నాయకులు అటవీ భూములను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజాకోర్టులో దండం పెట్టి చంపేస్తామని లేఖలో హెచ్చరించారు. లెటర్ హెడ్స్‌పై జగదల్‌పూర్ జిల్లా ఏరియా కమిటీ అని ముద్రించారు. ఈ లేఖలను గోదావరి బెల్ట్ ఏరియా మావోయిస్టు కార్యదర్శి మల్లికార్జున్‌కు పంపారు. అయితే రాజకీయ నాయకులతో పాటు మండలంలోని ఓ ప్రభుత్వ అధికారికి కూడా లేఖలు అందాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. అయితే.. చర్ల మండలం పుట్టపాడు అటవీ ప్రాంతంలో ఈ భీకర ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. మావోయిస్టు మృతి చెందిన ప్రదేశం నుంచి పోలీసులు ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, పోలీసులెవరూ గాయపడలేదు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారు. దీంతో వారిని పట్టుకునేందుకు గ్రేహౌండ్స్ బలగాలు నిత్యం కూంబింగ్ నిర్వహిస్తుంటాయి. కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇలాంటి సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు చనిపోతున్నారు. అలాగే, కొన్నిసార్లు పోలీసులు కూడా ఈ కాల్పుల్లో మరణిస్తారు.
KTR: నా కొడుకు టాలెంట్‌ చూసి షాక్‌ అయ్యా..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhadradri Kothagudem
  • chhattisgarh border
  • encounter
  • Jagtial District
  • Karimnagar Maoists Warning Letters

తాజావార్తలు

  • Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. మరోసారి ఉద్రిక్తతలు తప్పవా!?

  • Muse Spark: AIలో మార్క్ జుకర్‌బర్గ్ ప్రయోగం.. గూగుల్‌, ఓపెన్‌ఏఐకు ‘మ్యూస్ స్పార్క్’ సవాల్‌..

  • David Miller: “ఓటమికి కారణం నేనే”.. స్టేడియంలోనే ఏడ్చేసిన డేవిడ్ మిల్లర్.. హృదయాలను గెలిచిన అక్షర్!

  • Indian Bank Vacancy 2026: ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు ప్రారంభం.. భారీ జీతం

  • Stock Market: ఒక్కరోజు లాభాలు ఆవిరి.. భారీ నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions