ఇటీవల చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెట్‌పల్లి మండలం మేడిపల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సును టవేరా ఢీకొట్టింది. మెట్‌పల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న టవేరా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి టవేరా వెహికల్ నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో టవేరా వాహనంలో ప్రయాణిస్తున్న కోరుట్లకు చెందిన పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కర్ణాటక లోని గన్గాపూర్ దేవాలయానికి దర్శనానికి వెళ్లి…
Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు (జనవరి 3న) తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజయ్య స్వామిని దర్శించుకోనున్నారు.
Inter-Caste Love Affair: ఇద్దరు ప్రేమించుకున్నారు.. విషయం పెద్దల వరకు వెళ్లింది. కులాలు వేరుకావడంతో పలుమార్లు పంచాయతీలు.. దాడులు.. కేసులు అయ్యాయి. మళ్లీ యధావిధిగా ప్రేమించుకున్నారు. ఇలా నాలుగేళ్లపాటు సాగిన ఈ వ్యవహారం చివరికి యువకుడి ప్రాణం తీసింది. జగిత్యాల జిల్లా కిషన్ రావు పేటలో జరిగింది దారుణం. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో ప్రేమించిన పాపానికి దళిత యువకుడిని కత్తులతో దాడి చేసి చంపిన ఘటన కలకలం రేపింది. కిషన్‌రావు పేటకి చెందిన సల్లూరి మల్లెష్…
జగిత్యాల జిల్లా వెల్గటూరులో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడంటూ వెల్గటూర్ మండలం కిషన్ రావు గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్ (26)ను హత్య చేశారు యువతి తల్లిదండ్రులు. నేతకాని కులానికి చెందిన సూర మల్లేష్ కి గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం ఉంది. మా కొడుకును మాట్లాడుకుందాం రమ్మని పిలిచి మద్యం తాగించి హత్య చేశారని మృతుని బాబాయి ఆరోపించాడు. చంపిన తరువాత మీ కొడుకుని చంపినం అంటూ ఫోన్…
Dubba Rajanna Swamy: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామంలో వెలిసిన దుబ్బ రాజన్న స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా 2.50లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్సవాల షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 24న…
జన సమూహంలోని మహిళలను ఫొటోలు తీస్తూ... ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసిన జగిత్యాలకి చెందిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ అజ్ఞాత వ్యక్తి మహిళలను అసభ్యకరంగా ఫొటోలు తీస్తూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నాడు. గత కొంతకాలంగా పట్టణంలోని మార్కెట్, బస్టాండ్ తదితర ప్రాంతాలలో వివిధ అవసరాల నిమిత్తం వచ్చే మహిళల ఫొటోలు దొంగ చాటుగా తీస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు
తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని లేనిపక్షంలో కారుణ్య ఆత్మహత్యకు అయినా అనుమతించాలని కోరుతూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన నక్క సునీత అనే మహిళ ప్రజావాణిని ఆశ్రయించింది. ముగ్గురు మానసిక దివ్యాంగులైన పిల్లలతో ఉపాధి లేక పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ముగ్గురు పిల్లలు మానసిక దివ్యాంగులు కావడంతో తన భర్త ఉపాధి కొరకు గల్ఫ్ దేశానికి వలస వెళ్లినట్లు సునీత తెలిపింది.