Warangal Horror: వరంగల్ జిల్లాలో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక వివాహితపై అత్యంత క్రూరంగా దాడి చేసిన ఘటన స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో, ఆమెను బంధించి, వివస్త్రను చేసి దారుణంగా హింసించారు. ఈ ఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జరిగింది. తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే. ఇటీవల అతడికి ఒక సన్నిహిత బంధువైన వివాహితతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఇద్దరూ కలిసి దాదాపు 10 రోజుల క్రితం ఎటో వెళ్లిపోయారు. ఈ విషయం అతడి మొదటి భార్యకు తెలిసింది, ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు కోపంతో రగిలిపోయారు.
Read Also: Top Headlines @9PM: టాప్ న్యూస్!
ఇక, ఆ ఇద్దరిని వెతికి పట్టుకుని ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకు వచ్చారు. అక్కడ ఆ వివాహితను కట్టేసి, ఆమెను వివస్త్రను చేశారు. అయితే, అంతటితో ఆగకుండా, ఆమె ప్రైవేట్ పార్ట్‌లో జీడి పోసి మానవత్వం మరిచిపోయేలా దాడి చేశారు. బాధితురాలు ‘క్షమించండి’ అని కన్నీళ్లతో వేడుకుంటున్నప్పటికీ వారు దాడి చేశారని స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.