Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaatalan OTT Release: గ్రాఫిక్స్‌తో భారీ యాక్షన్ సీక్వెన్స్ చూపించడం ఇప్పుడు సాధారణ విషయమే. అయితే ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడకుండా నిజమైన ఏనుగుతో యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కిస్తే? అదే సాహసం చేసిన మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘కాటాలన్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో రియలిస్టిక్ యాక్షన్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. మలయాళ స్టార్ ఆంటోనీ వర్గీస్ పెపే ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో తెలుగు నటుడు సునీల్ కీలక పాత్ర పోషించగా, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. హీరోయిన్గా దుషార విజయన్ నటించగా, బాలీవుడ్ నటుడు కబీర్ సింగ్ కూడా కీలక పాత్రలో కనిపించారు. భారీ బడ్జెట్‌తో క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మే 28న థియేటర్లలో విడుదలైన ‘కాటాలన్’ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలోని ఏనుగు యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలకు సీజీఐ, వీఎఫ్ఎక్స్ ఉపయోగిస్తారు. కానీ ఈ చిత్ర బృందం మాత్రం నిజమైన ఏనుగుతోనే ఆ యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించడం విశేషం. థాయ్‌లాండ్‌లో జరిగిన షూటింగ్లో అంతర్జాతీయ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్ కెచ్చా ఖంపక్డీ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్లు తెరకెక్కించారు. చిత్ర బృందం వెల్లడించిన వివరాల ప్రకారం సినిమాలో కనిపించే ఏనుగు దృశ్యాలన్నీ నిజమైనవే. ఎలాంటి గ్రాఫిక్స్ ఉపయోగించలేదని స్పష్టం చేశారు. ‘ఓంగ్ బాక్ 2’ సినిమాలో కనిపించిన ప్రసిద్ధ ఏనుగు ‘పాంగ్’నే ఈ సినిమాలో వినియోగించడం మరో ప్రత్యేకతగా నిలిచింది.
Also Read
స్టంట్ కొరియోగ్రాఫర్ కెచ్చా ఖంపక్డీ గతంలో ‘బాహుబలి 2’, ‘జవాన్’, ‘పొన్నియిన్ సెల్వన్’, ‘బాఘీ 2’ వంటి భారీ చిత్రాలకు పనిచేశారు. దీంతో ‘కాటాలన్’ యాక్షన్ సన్నివేశాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో రూపొందాయి. అంతేకాదు ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అలాగే ‘కాంతార’ ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్ ప్రత్యేక గీతాన్ని స్వరపరిచారు. దర్శకుడు పోల్ జార్జ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి జోబీ వర్గీస్, జెరో జేకబ్ కథ అందించగా, ‘బిగ్ బి’, ‘చార్లీ’ చిత్రాలకు రచయితగా గుర్తింపు పొందిన ఉన్ని ఆర్ సంభాషణలు రాశారు. ప్రముఖ ఎడిటర్ షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ నిర్వహించగా, చంద్రు సెల్వరాజ్, రెణదేవ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. సిద్దిఖ్, జగదీష్, ఆన్సన్ పాల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన పొందిన ఈ సినిమా ఐఎమ్‌డీబీలో 8.2 రేటింగ్ సాధించడం విశేషం.
ఇప్పుడు ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘కాటాలన్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ మలయాళ ఓటీటీ వేదిక మనోరమ మ్యాక్స్ దక్కించుకుంది. ఇక ఈ మూవీ ఆగస్టు 4 నుంచి మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ రియలిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆస్వాదించే అవకాశం దక్కనుంది.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!