Warangal: భద్రకాళి చెరువు ఖాళీ చేసేందుకు సర్వం సిద్ధం.. అడ్డుకున్న మత్స్యకారులు..
- వరంగల్ జిల్లా భద్రకాళి చెరువు పూడికతీత పనులను అడ్డుకున్న స్థానిక మత్స్యకారులు..
- ఉపాధి చూపించాకే చెరువులోని నీటిని తీయాలని మత్స్యకారులు ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: వరంగల్ జిల్లా ఈరోజు భద్రకాళి చెరువుకు అధికారులు గండి కొట్టనున్నారు. భద్రకాళి చెరువు ప్రక్షాళనలో భాగంగా చెరువులోని నీరంతా దిగువకు వదిలేసి అందులో పూడికతీత, గుర్రపుడెక్క తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. నీటిని దిగువకు వదలడం, పూడికతీత పనులపై ఇప్పటికే ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారుల సమన్వయ సమావేశమైన విషయం తెలిసిందు. ప్రస్తుతం భద్రకాళి చెరువు 382 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు పూర్తి నీటి సామర్థ్యం 150 ఎంసీఎఫ్టీ లు.. ప్రస్తుతం 100 ఎంసీఎఫ్టీ నీరు నిల్వ ఉంది. ఇక రోజుకు 500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసేలా ప్లానింగ్ చేస్తున్నారు అధికారులు.
Read also: Sarpanch Oath Ceremony: కొత్తగా ఎన్నికైన 10 వేల మంది సర్పంచ్‌లతో ప్రమాణ స్వీకారం చేయించనున్న సీఎం
Also Read
- Warangal: ఐనవోలులో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద మృతి..
- RTC Bus Stuck: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
- Warangal: ప్రియుడితో కలిసి భర్త హత్యకు ఇల్లాలు కుట్ర.. బాధితుడు ఎలా బయటపడ్డాడంటే..!
- Warangal: భార్యను కొడుతుండగా అడ్డువెళ్లిన తండ్రి.. కట్ చేస్తే..?
దిగువన కాలనీలు ముంపుకు గురికాకుండా చర్యలు చేపట్టారు. 15 రోజులపాటు నీటిని దిగువకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కొండ సురేఖ ఆదేశాలు మేరకు భద్రకాళి చెరువును ఖాళీ చేయనున్నారు అధికారులు. చెరువు ఖాళీ చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. హనుమకొండ కాపు వాడ మత్తడి ద్వారా ప్రతిరోజు 300 నుండి 500 క్యూసిక్కుల నీళ్లను ఇరిగేషన్ శాఖ అధికారులు దిగువకు వదలనున్నారు. కాపు వాడ మత్తడి నుంచి అలంకార్ పెద్ద మోరీ, కాకతీయ కాలనీ, పెద్దమ్మగడ్డ, మీదుగా నాగారం చెరువులోకి నీళ్లను వదలనున్నారు. సుమారు 15 నుండి 20 రోజుల్లో చెరువు ఖాళీ చేయనున్నారు. పూడిక తీసిన అనంతరం నీళ్లు నింపడానికి కాకతీయ కాలువ ద్వారా ప్రణాళిక సిద్ధం చేశారు.
Read also: Hardeep Singh Puri: మనం రష్యా నుంచి చమురు కొనకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది..
అయితే మరోవైపు *భద్రకాళి చెరువు పూడికతీత పనులను స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. తమకు ఉపాధి చూపించాకే చెరువులోని నీటిని తీయాలని ఆందోళన చేపట్టారు. భద్రకాళి సొసైటీలో సుమారు 450 మంది సభ్యులు ఉన్నారు. సుమారు రెండు కోట్ల విలువచేసే చేపలు ఉన్నాయంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీవనోపాధి చూపించే వరకు పూడిక తీత అడ్డుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
MLA Gaddam Vinod: బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు భద్రత పెంపు.. ప్రభాత్ హెచ్చరిక లేఖతో అలర్ట్..
తాజావార్తలు
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..