కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకు కొత్త రైల్వే లైన్లు, కోచ్ ఫ్యాక్టరీ కోసం నిధులు తీసుకురావడంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారని తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో వరంగల్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ లు విరుచుకుపడ్డారు. రైల్వే లైన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం నిధులు విడుదల చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలిద్దరూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ఈ బడ్జెట్లో ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రైల్వే లైన్లు, కోచ్ ఫ్యాక్టరీల అభివృద్ధికి తెలంగాణకు న్యాయం చేయకుంటే బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో పర్యటించకుండా చేస్తామని హెచ్చరించారు. 11 కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించగా, కుంటి సాకులు చూపుతూ పక్కన పెట్టారని మండిపడ్డారు. ఈ సమావేశంలో పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..