Konda Surekha: ఉమ్మడి వరంగల్‌లోని కాంగ్రెస్ కీలక నేతలపై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేసింది. ఈరోజు మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ లో చేస్తూ.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి అని ఆరోపించింది. నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నాడని పేర్కొనింది. అందుకే నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడు అని తెలిపింది. ముఖ్యమంత్రి దగ్గరకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు వెళ్లి నా మీద ఉన్నది లేనిది చెబుతున్నాడు అని చెప్పుకొచ్చింది. తెలుగు దేశం పార్టీలో నడిపించుకున్నట్లు.. ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నాడు అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించింది.
Read Also: iPhone 16: ఇది కలనా.. నిజమా..? ఐఫోన్ 16 ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్స్ ఏంటి భయ్యా..!
అయితే, నా అదృష్టం ఉంది నేను మంత్రి అయ్యాను.. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యాడని కొండా సురేఖ తెలిపింది. నన్ను దిగిపోవాలని అనుకుంటే ఎలా అని ప్రశ్నించింది. నా కూతురికి అదృష్టం లేదు ఎమ్మెల్యే కాలేదు.. కడియం కూతురికి అదృష్టం ఉంది ఎంపీ అయ్యింది.. నేను ఆమె ఎంపీ పదవి తీయాలని అంటున్నానా అని అడిగింది. అలాగే, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై ఆమె తీవ్రంగా మండిపడింది. భద్రకాళీ టెంపుల్ ఎవరి సొత్తు కాదు.. కొందరు తమ సొత్తు అన్నట్లు ఫీల్ అవుతున్నారు.. నాయిని రాజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం సరికాదు.. ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. ఆగమశాస్త్రం ప్రకారమే భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. అక్కడ యాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అమ్మవారు శాఖాహారి అని అందరికీ తెలుసు.. అక్కడ ఏళ్లుగా పని చేస్తున్న పూజార్ల అభిప్రాయం తీసుకున్నాం.. బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకువెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తామని మంత్రి కొండా సురేఖ వెల్లడించింది.