తెలంగాణలో ఇద్దరు దళిత నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. స్టేషన్గన్పూర్ నియోజకవర్గం లో ఇద్దరు దళిత నాయకుల మధ్య దళిత బంధు పంచాయతీ కొనసాగుతుంది.. ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎం దళిత బంధు విషయంలో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడంతో దళిత వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టేషన్ ఘనపూర్ లో CMRF చెక్కుల పంపిణీ సందర్భంగా దళిత బంధులో బంధుప్రీతి పెరిగిందని సరైన అర్హులకు దళిత బంధు అందడం లేదంటూ కడియం చేసిన కామెంట్ .. ఎమ్మెల్యే రాజయ్య గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.. రెండు రోజుకుగా కడియం శ్రీహరి పైనా పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారు.
సోమవారం చేపల పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దళిత నేతగా గుర్తింపు పొందిన నేను దళితులకు ఎప్పుడు అన్యాయం చేయాలేదన్నారు. అర్హులకే దళిత బంధు అందించాం.విడతల వారిగా అందరికి దళిత బంధు వస్తుంది అని హామీ ఇచ్చిన రాజయ్య మంగళవారం సైతం దాన్ని కొనసాగింపుగా కడియం శ్రీహరికు పరోక్ష చురకలు అంటించారు.. స్టేషన్ ఘనపూర్ లో మొదటి విడత ఇచ్చిన దళిత బంధులో ఎవ్వరు అనర్హులో చెప్పాలి అని సవాల్ విసిరారు. అదే సమయంలో మా బంధువులకు . మా అనుచరులు దళిత బంధు తీసుకోరు అని చెప్పగలరా అని పరోక్షంగా చురకలు అంటించారు. దళిత జాతిలో పుట్టిన ఆ నేత మా వర్గాల వారికి దళిత బంధు అవసరం లేదని చెప్పగలరా? మా బంధువులకు దళిత బంధు ఇవ్వాల్సిన పనిలేదని మాటిస్తారా? అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో స్టేషన్గన్పూర్లో ఇద్దరి నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో దళిత వర్గాలు నలిగిపోతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ డివిజన్ కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య మరో సారి కడియం శ్రీహరి పైన పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. దళిత బంధు పంపిణి జరుగుతున్న పారదర్శకత పార్టీ లోని సభ్యుల గుర్తించకపోతే ఎలా? అన్నారు. రాజయ్య నువ్వు స్థానికుడివి రాజకీయలలోకి రావాలి అని అంటే రాజకీయాల్లోకి వచ్చా. కొందరు నేనొస్తా నేనొస్తా అని వస్తున్నారు. ప్రజాదరణ లేకపోతే ఏమైవుతుంది? కేసీఆర్ కి నేను వీర విధేయుడిని. కేసీఆర్ విధేయతలో ఎవరితో అయిన నేను పోటీకి సిద్ధం అన్నారు రాజయ్య. స్టేషన్ ఘనపూర్ లో మొదటి విడత దళిత బంధు ఇచ్చిన వంద మందిలో ఎవరు అర్హులు కాదో చెప్పాలని సవాల్ చేశారు.
Read Also: Vasireddy Padma: మహిళలకు ప్రేమించే హక్కు, నిరాకరించే హక్కు రెండూ ఉంటాయి
కొన్ని రాజకీయ కారణాల తో పదవి తీసేసిన కేసిఆర్ కు విధేయుడి గానే ఉన్నా.. ఉంటానన్నారు. తపస్సు చేసే ఋషులు ఓం నమశివాయ అంటే.. నేను మాత్రం ఓం కేసీఆర్ అనే మంత్రాన్నే వల్లెవేస్తానన్నారు. స్టేషన్ ఘనపూర్ ప్రజలు స్థానిక నాయకత్వం కోరుకుంటున్నారు అది మీరు అనుభవిస్తున్నారు. తాటాకు చప్పుళ్ళకు నేను భయపడేది లేదని స్పష్టం చేశారు రాజయ్య.