Telangana Election 2023: నవంబర్ 30 హాలీడే కాదు.. ఓటింగ్ డే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Election 2023: తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించిందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగానే ఉందని, ఈసారి దానిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ నెల 30న జరిగే ఓటింగ్‌లో ఓటర్లు తమ ఓటుహక్కును ప్రశాంతంగా, స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఓటర్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, పోలీసులు సహా దాదాపు మూడు లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులకు హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 4,70,270 పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, 8,84,584 ఈవీఎం బ్యాలెట్ పేపర్లు ముద్రించామని తెలిపారు. టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు కోసం అదనపు బ్యాలెట్ పత్రాలను ముద్రించినట్లు తెలిపారు. తపాలా శాఖ ద్వారా 51 లక్షల ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేశామన్నారు. ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించిందని వికాసరాజ్ తెలిపారు. పరిశీలకుని అనుమతితో రిటర్నింగ్ అధికారి ప్రతి రౌండ్ ఫలితాన్ని ప్రకటిస్తారని సమాచారం.
Read also: Tummala vs Puvvada: ఖమ్మం గుమ్మంలో పువ్వాడ, తుమ్మల.. సై అంటే సై అంటున్న కీలక నేతలు
Also Read
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఇంటింటి ఓటింగ్ విధానాన్ని అమలు చేశామని, ఇప్పటి వరకు 14 వేల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వికాస్‌రాజ్ తెలిపారు. ఇందులో 80 ఏళ్లు పైబడిన వారు 9,386 మంది, వికలాంగులు 5,022 మంది, అత్యవసర సేవల సిబ్బంది 253 మంది ఉన్నారు. రాష్ట్రంలోని 2.81 కోట్ల (86%) ఓటర్లకు ఓటింగ్ స్లిప్పులు పంపిణీ చేయబడ్డాయి. ఈవీఎంలు తీసుకెళ్లే ప్రతి వాహనంలో జీపీఎస్‌ను అమర్చనున్నట్లు సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. ప్రైవేట్ వాహనాల్లో ఈవీఎంలను తరలించడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సూచించిన వాహనాల్లో కాకుండా ఇతర వాహనాల్లో ఈవీఎంలను తరలిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 10,106 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు వికాస్‌రాజ్ తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అనుచరులపై 777 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.669 కోట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. రూ.260 కోట్ల నగదు, రూ.108 కోట్ల మద్యం ఉన్నట్లు తెలిపారు. 183 కోట్ల విలువైన బంగారం, ఇతర వస్తువులు, రూ. 81 కోట్ల పారితోషికం ఉందన్నారు. రైతుబంధుపై ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను అనుమతి కోరిందని, ప్రభుత్వం నుంచి వివరణ కోరామని చెప్పారు. ఈ సమావేశానికి అదనపు సీఈవో లోకేష్‌కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈవో సత్యవాణి హాజరయ్యారు.
Priyanka Gandhi: తెలంగాణలో నేడు, రేపు ప్రియాంక ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఇదే
తాజావార్తలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
-
Sanjay Raut: కాంగ్రెస్‌లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!