Vinod Kumar: ఇంటిపేరు ఓకే విధంగా ఉంటే చుట్టాలుగా పరిగణించడం అనేది ఏ సంస్కృతి? అని బీజేపీ పై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. చుట్టాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి రికమండేషన్ చేసినానని వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. జర్నలిజం విలువలు తెలియని వాళ్ళు జర్నలిజం చేసి వార్తలు రాయాలని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న వార్తలు వేసే ముందు జర్నలిజం గురించి తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సోషల్ మీడియాలో వేసిన వార్త ఏ ఆధారాలతో వేశారు? అని ప్రశ్నించారు. ఇంటిపేరు ఓకే విధంగా ఉంటే చుట్టాలుగా పరిగణించడం అనేది ఏ సంస్కృతి? అని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రపంచమంతా తిరిగిన అబద్ధ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లలో ఎవరేం చేసారు అనేది అన్ని బయట పెడతా అని హెచ్చారించారు.
Read also: MLC Jeevan Reddy: ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియలో గవర్నర్ చొరవ చూపాలి..!
కాగా.. తెలంగాణ జెన్ కోలో దాదాపు 25 మంది అక్రమంగా ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ విషయమై పలుమార్లు సమాచార హక్కు చట్టం కింద అధికారులకు విన్నవించినా సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. జెన్ కో గవర్నింగ్ బాడీ సమావేశం 30 మే 2017న జరిగింది. ఈ సమావేశంలో మహిళను ఉద్యోగిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే ఏడాది జూలై 27న సదరు మహిళకు అపాయింట్‌మెంట్ లెటర్ కూడా ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మహిళ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని ఓ కీలక ప్రజాప్రతినిధి మేనల్లుడి భార్య అని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.. అక్రమంగా ఉద్యోగం సంపాదించుకున్న ఆమె ఎప్పుడూ ఆఫీసుకు రాలేదన్న ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారడంతో ఆమె తోటి ఉద్యోగులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారని వార్తలు వచ్చాయి. అయితే జెన్ కోలోనే కాకుండా పలు శాఖల్లోనూ ఇలాంటి అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Son Killed Mother: దారుణం.. ఆస్తికోసం కన్నతల్లినే కడతేర్చిన కొడుకు..