Vinay Bhaskar : రాహుల్ గాంధీకి దేశ సరిహద్దులు తెలుసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్‌లో రాహుల్‌గాంధీ పర్యటన, సభ నేపథ్యంలో నేడు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కామెంట్స్‌కు వరంగల్ హన్మకొండ జిల్లాల అధ్యక్షులు వినయ్ భాస్కర్, అరూరి రమేష్ లు కౌంటర్ ఇచ్చారు. అరూరి రమేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే రైతుల ఆత్మహత్యలు జరిగాయని, రైతులకు అండగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని, ఉద్యమ నేత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను విమర్శించే నైతిక హక్కు రేవంత్ రెడ్డి కి లేదని ఆయన మండిపడ్డారు.
కరెంటు కోసం ధర్నా చేసిన రైతులను కాల్చి చంపిన పార్టీలో ఉన్న నీవు.. రైతుల కోసం సభలు పెడుతాము అనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. యాత్రలు చేయటం, సభలు పెట్టిన.. కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని ఆయన అన్నారు. అనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ పేరు వింటే… ప్రతిపక్షాలకు వణుకు మొదలైందని, టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read
ప్రతిపక్ష నేతలు జైలు కి ఎందుకు పోయారు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చందుకు జైలు కి వెళ్ళామని, నువ్వు జైలు కి ఎందుకు పోయావు.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి క్రమంలో అడ్డంగా దొరికి పోయి జైల్ కి వెళ్లావు అంటూ రైవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీకి దేశ సరిహద్దు తెలుసా అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు రాహుల్ కి తెలుసా అని, దేశ ప్రధానికి కన్ను కొట్టుడు తెలుసు కౌగిలించుకోవడం తెలుసు.. ఇలాంటి రాహుల్ గాంధీ వరంగల్ లో సభ పెట్టాలని చెప్పారాట. మా రాష్ట్రానికి రైతు కోసం రాకండి. ముందు క్రమ శిక్షణ నేర్చుకోండని ఆయన హితవు పలికారు.
తాజావార్తలు
-
Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
-
PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
Thirukkural: పుతిన్‌కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
-
Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
-
Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?