Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఆధ్యాత్మిక కథల జోరు గట్టిగా నడుస్తోంది. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే సరికొత్త దైవిక ప్రయాణంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. నీబ్ కరోలీ బాబా జీవితాధారంగా తెరకెక్కిన ఈ అద్భుతమైన కథను ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు రంగం సిద్ధమైంది.
టాలీవుడ్ మాటల మాంత్రికుడు, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెలుగులో సమర్ధిస్తుండటం విశేషం. ఇక ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రిలీజ్ బాధ్యతలను ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ (Fortune 4 Cinemas) సంస్థ చేపట్టింది. ఈ క్రేజీ కాంబినేషన్‌తో వస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 18వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ ఒక ముఖ్యమైన చర్చ జోరుగా నడుస్తోంది. సాధారణంగా ఈ కాలంలో దైవిక అంశాలు, బాబాల జీవితాల ఆధారంగా సినిమాలు వస్తే వాటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. కొందరు వీటిని అద్భుతంగా స్వీకరిస్తే, మరికొందరు సైంటిఫిక్ అప్రోచ్ లేదంటూ విమర్శిస్తుంటారు. అయితే, నీబ్ కరోలీ బాబా అసాధారణ తత్వశాస్త్రం, ఆయనకు ఉన్న భక్త కోటి అంతాఇంతా కాదు. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రపంచ దిగ్గజాలకే స్ఫూర్తిగా నిలిచిన ఆ మహాపురుషుడి కథను తెరకెక్కించడం ఒక సాహసోపేతమైన అడుగుగా ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
Also Read
దేశవ్యాప్తంగా ఇప్పటికే ఒక భావోద్వేగ తరంగాన్ని సృష్టించిన ఈ దైవిక ప్రయాణం, తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో కట్టిపడేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ ప్రెజెంటేషన్ తో వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. విశాల్ చతుర్వేది రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభిన్ అవ్ సత్యా, విహాన్ శేడ్గే ప్రధాన పాత్రల్లో నటించారు. చందన్ ఆనంద్, పూర్ణిమ తివారీ, ఎ.కె. రాస్తోగి, గులాజన్ పాండే తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. స్వంభు మీడియా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి విశాల్ త్రివేది సినిమాటోగ్రఫీ అందించారు.
సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానున్న ఈ డివైన్ జర్నీ తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచుతుందో వేచి చూడాలి!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!