వ్యాక్సిన్ల కోసం స్థానిక నేతలు దౌర్జన్యానికి దిగడం చర్చగా మారింది.. అసలే వ్యాక్సిన్ల కొరత ఉండడంతో.. ఓ క్రమ పద్దతి ప్రకారం వ్యాక్సిన్లు పంపిణీ చేస్తోంది సర్కార్.. అయితే, ఇవాళ హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ఓ పార్టీకి చెందిన స్థానిక నేతలు దౌర్జన్యానికి దిగారు.. సూపర్ స్పైడర్స్ కు ఇవ్వాల్సిన టోకెన్‌లు తమ అనుచరుల కుటుంబసభ్యులకు ఇవ్వాలని వీరంగం సృష్టించారు.. దీంతో.. నిజమైన సూపర్ స్పైడర్స్ కు అన్యాయం జరుగుతుందంటూ వాక్సిన్ వేసేందుకు నిరాకరించారు వైద్యులు..…
మూడు రోజులు సూపర్ స్ప్రెడర్స్‌కు వ్యాక్సినేషన్ కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.. ఈ నెల 28,29, 30 తేదీల్లో వారికి వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు .. ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రతి రోజు వైద్య శాఖ పై సమీక్ష నిర్వహిస్తున్నారన్న ఆయన.. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 3.8 శాతానికి తగ్గిందన్నారు.. ఆస్పత్రుల్లో కోవిడ్ అడ్మిషన్స్ కూడా తగ్గాయన్న ఆయర.. రికవరీ రేట్ 92.52 శాతానికి పెరిగిందని.. డెత్ రేట్ 0.52 శాతానికి పడిపోయిందన్నారు..…