V Hanumantha Rao: సీనియర్లను పట్టించుకోవట్లేదు.. స్రవంతికి టికెట్ ఇవ్వడంపై వీహెచ్ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Hanumantha Rao Reacts On Palvai Sravanthi Ticket: పాల్వాయి స్రవంతికి మునుగోడు టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు స్పందించారు. ఆమెకు టికెట్ ఇవ్వడం మంచిదేనని, ఓ కార్యకర్తకు టికెట్ ఇచ్చారని అన్నారు. పాల్వాయి స్రవంతి ఒక పక్కా కాంగ్రెస్ వ్యక్తి అని తెలిపారు. డబ్బులే రాజకీయం కాదని, పార్టీ కార్యకర్తలకు టికెట్ ఇవ్వడమంటే గౌరవం ఇవ్వడమని చెప్పారు. కానీ.. పార్టీ సీనియర్ నాయకులను పరిగణనలోకి తీసుకోకపోవడమే బాధాకరమన్నారు. ఇప్పటికీ వాళ్లకు వాళ్లే మాట్లాడుకుంటున్నారని, తమదాకా ఎలాంటి సమాచారం రావడం లేదని పేర్కొన్నారు. అంటే.. పార్టీ నిర్ణయాల్లో సీనియర్లను పెద్దగా ఇన్వాల్వ్ చేయట్లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంగతేంటో తెలియడం లేదని, పార్టీ అధిష్టానం ఏం కో-ఆర్టినేషన్ చేస్తోందో తనకేం తెలియదని వీ హనుమంతరావు వెల్లడించారు. వెంకటరెడ్డి ముందుకు వస్తే మంచిదన్నారు. హైకమాండ్ ఎవరితో సంప్రదిస్తోందనే విషయాలు తనకు పూర్తిగా తెలియదన్నారు. ఇక తమిళిసై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తన నలభై ఏళ్ల జీవితంలో ఇలా మాట్లాడిన గవర్నర్ లేరన్నారు. సీఎం కేసీఆర్, గవర్నర్ మధ్య తగాదా ఏంటో స్పష్టత లేదన్నారు. అయితే.. ఆ ఇద్దరి మధ్య గ్యాప్ ఏ విషయంలో వచ్చిందనేది ప్రజలకు తెలియాలని సూచించారు.
Also Read
తాజావార్తలు
-
iQOO 15T: ఐకూ 15T వచ్చేస్తోంది.. 200MP ప్రధాన కెమెరా, 8000mAh బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు
-
Mohsin Naqvi: ఐపీఎల్ ఫైనల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీని బీసీసీఐ ఆహ్వానించిందా? క్లారిటీ ఇదిగో..
-
Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
-
David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ నుంచి క్రేజీ లీక్ వైరల్!
-
Sunil Narine: ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాలని ఉంది.. ఒక్కసారిగా ఏడ్చేసిన కేకేఆర్ స్టార్ సునీల్ నరైన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..