Uttam Kumar Reddy: అక్కడ 50 వేల మోజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాలకు గుడ్‌బై..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ, కాపుగల్లు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ, రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.. కోదాడ ప్రాంతం అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది. గ్రామంలో అరాచక శక్తులు, దాదాగిరి చేసేవాళ్లు పెరిగిపోయారంటూ మండిపడ్డారు.. గతంలో కోదాడ ప్రాంతం ప్రశాంతంగా ఉంది… ఇప్పుడు ఇతర పార్టీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని విమర్శించారు. అయితే, ఎమ్మెల్యే కు ఇదే చివరి అవకాశం… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. కోదాడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 50 వేల మెజారిటీ ఓట్లు కంటే ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సంచలన ప్రకటన చేశారు.
Read Also: Viral: ఆ మాజీ మంత్రి కాంగ్రెస్ గూటికి..? సోషల్ మీడియాలో వైరల్..
Also Read
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ఇక, దళితబంధు విషయంలో 100 యూనిట్లకు రెండు లక్షల రూపాయలు లంచం తీసుకోవడం ఏమిటి? అంటూ ప్రశ్నించారు ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. గుడిబండ గ్రామంలో దళిత బంధు పథకంలో అధికార పార్టీ నాయకులు లబ్ధిదారుల నుండి రెండు లక్షల రూపాయల కమిషన్ తీసుకుంటున్నారని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.. కోదాడ ప్రాంతంలో అభివృద్ధి శూన్యం… టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇప్పుడు ఉన్న నాయకున్ని త్వరలోనే వెళ్లగొట్టడం ఖాయం అంటున్నారని తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే, పోలీసులు, అధికారులు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ.. గుడిబండ గ్రామంలో అత్యధిక మెజారిటీ వస్తుంది, గుడిబండ గ్రామంలో 80 శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకే వేస్తారన్న ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 50 వేల మెజారిటీ కంటే ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటించారు. ఇప్పుడు ఉత్తమ్ వ్యాఖ్యలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిపోయాయి.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!