Uttam Kumar Reddy: సివిల్ సప్లయ్ ఉన్నతాధికారులతో సచివాలయంలో నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావ్, సివిల్ సప్లయ్ కమిషనర్ అనిల్ కుమార్ హాజరయ్యారు. త్వరలో మహాలక్మి పథకం కింద 500 రూపాయలకు వంట గ్యాస్ సిలెండర్ ఇచ్చే అంశంపై చర్చిస్తున్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ.. రేషన్ లబ్దిదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా అంశాన్ని అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చిస్తున్నారు.
Read also: K Laxman: కాంగ్రెస్ ఓబీసీలకు వంచించి మోసం చేసింది.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
నిన్న తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాడ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ అంబేదర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల పని నిర్వహణ, అనుమతులు, ఆర్థిక అవసరాలు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని ప్రాజెక్టుల వారీగా సమగ్ర నివేదిక రూపొందించాలని ఇరిగేషన్ అధికారులను మంత్రులు ఆదేశించారు. ఈ నివేదిక అనంతరం ప్రాజెక్టుల వారీగా మరోసారి పూర్తి స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా ప్రాజెక్టులపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులకు నివేదిక అందజేశారు. సభకు అధ్యక్షత వహించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతను వివరించారు. ప్రాజెక్టుల పురోగతి, ఖర్చు చేసిన నిధులు, తదుపరి నిధుల అవసరాలకు సంబంధించి వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు త్వరగా సమగ్ర నివేదికలు అందజేయాలని స్పష్టం చేశారు. దీని వల్ల ప్రభుత్వం చేయబోయే ప్రయత్నాలపై స్పష్టత వస్తుందన్నారు. త్వరలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో మరోసారి సమీక్ష ఉంటుందన్నారు.
Golden Nike Shoes : ఈ బూట్లు చాలా ఖరీదైనవి..ప్రత్యేకతలు, ధర?