Uttam Kumar Reddy : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. సిద్ధంగా ఉండండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని విపక్ష నేతలు ముక్తకంఠంతో అంటున్నారు. అయితే గతంలో కూడా కేసీఆర్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. మళ్లీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో తెలంగాణలో విపక్ష పాత్ర పోషించే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పలేకపోయింది. అయితే ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకమైన నాటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు కొత్త జోష్‌తో ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకమైన నాటి నుంచి బీజేపీ కూడా తెలంగాణ పుంజుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్పొరేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సత్తా చాటారు.
అంతేకాకుండా విపక్ష పార్టీ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టిన బీజేపీ ఆ స్థానాన్ని కొట్టేసింది. ఆ ఎన్నికల తరువాత టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకమైన నాటి నుంచి కాంగ్రెస్‌లో సీనియర్స్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి లు అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డికి కోమిటిరెడ్డి వెంకట్‌రెడ్డి ల మధ్య సఖ్యత కుదిర్చారు. అయితే జగ్గారెడ్డితో మాత్రం రేవంత్‌రెడ్డికి సెట్ అవడం లేదని పార్టీలోని నేతలే అంటున్నారు. అయితే తాజాగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ.. తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. అంతేకాకుండా కర్ణాటక తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ వదిలేసి… నియోజక వర్గాలకు వెళ్ళండని ఆయన పిలుపునిచ్చారు. దీనితో పాటు నేను ఎక్కడ పోటీ చేయాలి అనేది సోనియా గాంధీ నిర్ణయిస్తారని ఆయన వెల్లడించారు.
Also Read
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్‌వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
తాజావార్తలు
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Upcoming IPOs: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్.. వచ్చే 7 రోజుల్లో లక్షల కోట్ల గోల్డెన్ ఛాన్స్! ఎలాగో తెలుసా..
-
Rahul Gandhi: అయ్యా రాహుల్ గాంధీ.. ఇటలీని చూసి నేర్చుకోండి
-
Vaibhav: అది సార్ ‘వైభవ్ సూర్యవంశీ’ అంటే.. తిట్టిన నోళ్లే జైజైలు కొట్టాయి.. ఫిదా అయిన లంక ఆటగాళ్లు..
-
Cricket Helmet History: క్రికెట్ హెల్మెట్ వెనుక ఆసక్తికర కథ.. ఎలా పుట్టిందో తెలుసా..
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!