Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లాలో నేడు ఉదయం ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేయడంతో పెను ప్రమాదం తప్పింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఆదివారం ఉదయం 8 గంటలకు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరింది. అలుగునూర్ శివారులోని కాకతీయ కాలువ సమీపానికి చేరుకోగానే బస్సులో షార్ట్‌సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ ప్రశాంత్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డుపక్కన ఆపాడు. అనంతరం ప్రధాన ద్వారంతో పాటు ఎమర్జెన్సీ గేట్లను తెరిచి ప్రయాణికులందరినీ క్షేమంగా బయటకు పంపించాడు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Also Read
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
ప్రయాణికులను సురక్షితంగా దించిన తర్వాత డ్రైవర్, సిబ్బంది బస్సులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే మంటలు ఎక్కువ కావడంతో వాటిని నియంత్రించడం సాధ్యపడలేదు. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత కూడా అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా చేరుకున్నారని స్థానికులు ఆరోపించారు.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..