Telangana Weather: వెరైటీ వెదర్.. చలి, ఎండకాలం మధ్యలో అకాల వర్షాలు ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Weather: మొన్నటి వరకు రాష్ట్రంలో చలి చంపేసింది. నగరవాసులు శివరాత్రి వరకు చలితో వనకాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. అయితే గత వారం రోజుల నుంచి ఎండలు దర్శనమిచ్చాయి. హమ్మయ్య చలి పోయింది ఎండలు వచ్చాయి కాస్త ఉపసమయం కలిగింది అనుకునేలోపే ఇప్పుడు వెరైటీగా చలి, ఎండకాలాల మధ్యలో అకాల వర్షాలు ఎంట్రీ ఇచ్చాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురిసిన ఈ అకాల వర్షాలతో రైతులు బెంబేలెత్తి పోతున్నారు. ఇక నిర్మల్ జిల్లాలోని భైంసాలో అకాల వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం పూట తానూర్, ముధోల్ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసాయి. ఈ వర్షంతో ఆ ప్రాంతంలోని రైతుల్లో ఆందోళన నెలకొంది.
Read also: Texas Megachurch: టెక్సాస్ మెగాచర్చిలో కాల్పులు.. మహిళను కాల్చి చంపిన పోలీసులు!
Also Read
ఆరు గాలం శ్రమించి పండించిన పంట చేతికోచ్చే సమయంలో ఇలా అకాల వర్షం కురవడంతో తమ కష్టమంతా నీటి పాలవుతుందామో అని రైతుల ఆందోళన చెందుతున్నారు. వర్షంతో పలుచోట్ల వరి పైర్లన్ని నేలరాలాయి. దీంతో రైతన్న కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే.. రెండు మూడు రోజులుగా ఉదయం పూట ఎండలు మండుతుంటే.. సాయంత్రం కాగానే ఈదురు గాలులు వస్తుండటంతో.. అన్నదాతలకు టెన్షన్ మొదలైంది. ఏటా పంట చేతికి వచ్చే సమయంలోనే వర్షాలు కురవడం పంటంతా వర్షార్పణం కావటం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. వరి రైతులతో పాటు మామిడి రైతులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. వర్షం, ఈదురు గాలుల వల్ల మామిడి పూత రాలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
Texas Megachurch: టెక్సాస్ మెగాచర్చిలో కాల్పులు.. మహిళను కాల్చి చంపిన పోలీసులు!
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!