Tollywood: చిరంజీవి నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఉగాది సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించే 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ జాతీయ ఉత్సవాలకు చిరంజీవిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరగనున్నాయి. ఈ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద, గిరిజన కళారూపాలు, నృత్యాలు, సంగీతం, వంటకాలు, సంస్కృతులు దర్శనమివ్వనున్నాయి.
ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి తన నివాసానికి వచ్చిన విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ జాతీయ ఉత్సవాలకు కిషన్‌రెడ్డి తనను ఆహ్వానించడంపై కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కడం తనకు లభించిన గౌరవంగా భావిస్తానని చిరంజీవి పేర్కొన్నారు. కళాకారులకు జీవనోపాధి దృష్ట్యా ఇలాంటి కార్యక్రమం వారికి గొప్ప వేదిక అవుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. అటు కిషన్ రెడ్డి తన నివాసానికి రావడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.
Also Read
- CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
- KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్‌కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
Thank you @kishanreddybjp garu#RashtriyaSanskritiMahotsav pic.twitter.com/Qu7ZsP1d1X
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 5, 2022
తాజావార్తలు
-
Delhi: జంతర్‌మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్‌లో రాజకీయ కల్లోలం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?