కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఉగాది సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించే 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ జాతీయ ఉత్సవాలకు చిరంజీవిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరగనున్నాయి. ఈ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద, గిరిజన కళారూపాలు, నృత్యాలు, సంగీతం, వంటకాలు, సంస్కృతులు దర్శనమివ్వనున్నాయి. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి తన నివాసానికి వచ్చిన విషయాన్ని మెగాస్టార్…