BJP Meting: న్యూఢిల్లీలో మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కిషన్ రెడ్డి రెండోసారి డుమ్మా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Meting: నేడు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే ..కేంద్ర మంత్రివర్గ సమావేశానికి కిషన్ రెడ్డి కూడా హాజరుకాలేదు. గత వారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఈ నెల 4వ తేదీన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఇప్పటివరకు కొనసాగుతున్న బండి సంజయ్‌ను బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే వరకు మంత్రిగా కొనసాగుతానని కిషన్ రెడ్డి వారం రోజుల క్రితం ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత కిషన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి సారించారు.
Read also: Narne Nithin: ఎన్టీఆర్ బావమరిది.. అల్లు అరవింద్ చేతిలో.. నో కన్ఫ్యూజన్
Also Read
తన శాఖ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఈ నెల 8న వరంగల్ లో జరిగిన ప్రధాని మోదీ పర్యటన విజయవంతం కావడంలో కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం తర్వాత రెండోసారి మంత్రివర్గ సమావేశం జరగనుంది. కిషన్ రెడ్డి వరుసగా రెండు సమావేశాలకు గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో గత సమావేశానికి హాజరు కాలేదని కిషన్ రెడ్డి సమాచారం పంపారు. అయితే నేటి సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో ఇంకా తేలలేదు. తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. దీంతో పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ ప్రస్తుతం సాగుతోంది.
Toyota Fortuner Price 2023: 15 లక్షలకే టయోటా ఫార్చ్యూనర్.. క్షణాల్లో డెలివరీ కూడా!
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?