Waltair Veerayya: వరంగల్ కు వాల్తేరు వీరయ్య టీమ్.. గెస్ట్ గా ఆర్ఆర్ఆర్ హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆయన నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. చిరంజీవి గతేడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో పలకరించారు. ఇక ఆయన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన 154వ చిత్రాన్ని వాల్తేరు వీరయ్య అనే సినిమా యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ప్రచార చిత్రాలకు, మౌత్ టాక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో మిగతా సినిమాలతో పోలిస్తే వాల్తేరు వీరయ్య మంచి కలెక్షన్స్ రాబడుతోంది.. ఈ సినిమా భారీ విజయం సాధించడమే కాదు.. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో చిత్రబృందం చిత్ర విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించనుంది. అందులో భాగంగానే వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ ను వరంగల్ లో సినీ అభిమానులు, అతిథుల సమక్షంలో గ్రాండ్ గా నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం ఆర్ట్స్ కళాశాల మైదానంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిధిగా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి వాల్తేరు వీరయ్య బృందం అధికారిక ప్రకటన చేయనుంది. చిరు రాక కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read also: Nagoba Jathara: నేటితో ముగియనున్న నాగోబా జాతర.. స్వగ్రామాలకు మెస్రం వంశీయులు
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
ఇక ఈ వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్లలో విడుదలైంది.ఇతర ఏరియాలతో పోలిస్తే నైజాంలో తొలిరోజు అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టింది. నైజాం ఏరియాలోనే కాదు.. సీడెడ్, ఉత్తరాంధ్రలో కూడా మంచి బుకింగ్స్ నమోదయ్యాయి.. అంతేకాదు అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే రెండు మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇలా చిరంజీవి కెరీర్ లో 2 మిలియన్ అందుకున్న మూడో సినిమాగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసిందని టాక్. ఇంతకుముందు 2 మిలియన్ అందుకున్న చిరంజీవి నటించిన ఇతర సినిమాలు సైరా, ఖైదీ నంబర్ 150. ఈ చిత్రం అక్కడ ఇప్పటివరకు 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. త్వరలోనే 3 మిలియన్లకు చేరుకోవచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమాలో రవితేజ, విక్రమ్ సాగర్ పోలీస్ పాత్రలో నటించారు. తెలంగాణ యాసలో మాస్ మాహారాజా వావ్ అనిపించారు. ఇక రవితేజ ఇటీవల ధమాకా సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నసంగతి తెలిసిందే. అయితే.. ఆయనకు వాల్తేరు వీరయ్య రూపంలో మరో హిట్ పడింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించి అందరిని ఆకట్టుకుంది.
KTR Nizamabad Tour: నేడే నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్.. శంకుస్థాపనలు, బహిరంగ సభ
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!