ATA Celebrations 2022: జోరుగా ‘ఆటా’ మహాసభల ఏర్పాట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.. న భూతో న భవిష్యతి అన్న విధంగా, వందలమంది కళాకారులతో అమెరికా రాజధాని ప్రాంతమైన వాషింగ్టన్ డీసీలో రెండు లక్షల చదరపు అడుగుల సువిశాలమైన, అత్యంత సుందరమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌లో అట్టహాసంగా ప్రారంభించడానికి సన్నాహాలు సాగుతున్నాయి.. దీనికోసం 80కి పైగా కమిటీలు రేయింబవళ్ళు కష్టపడుతున్నాయి.. ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల, కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్దినేటర్ కిరణ్ పాశం, కో-హోస్ట్ కాట్స్ అధ్యక్షులు సతీష్ వడ్డీ మరియు ఇతర కీలక సభ్యులు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాలనుంచి వచ్చే అతిధులకు కోసం రవాణా, భోజన, హోటల్ వసతి ఏర్పాట్లు చేయడానికి ఒక సైన్యం రెడీ అవుతుంది. ఎప్పుడులేనివిధంగా ఈసారి మేరీల్యాండ్ /వర్జీనియా నుంచి వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ వరకు షటిల్ సర్వీసెస్ ఏర్పాటుచేస్తున్నారు నిర్వహకులు.
Read Also: Gold Rate Today: మళ్లీ పైకి కదిలిన పసిడి రేటు
Also Read
ఇక, ఆటా మహాసభలకు మొట్టమొదటి సారిగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్ (సద్గురు) గారికి స్వాగతం చెప్పడానికి వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు ,”Daaji” కమలేష్ D.పటేల్ ప్రసంగం కోసం తెలుగు వాళ్లతో పాటు ఇతరులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రముఖ కవులు, ప్రముఖ సినీ కళాకారులు, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ నుంచి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రికెట్ లెజెండ్స్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, మరియు టీ20, వన్ డే క్రికెట్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి కళ్లు జిగేల్ మనిపించే క్రిస్ గేల్ ని కలవడానికి, వారితో సంభాషించడానికి ఎంతో ఉత్సుకతో వున్నారు. “మ్యాస్ట్రో” “పద్మవిభూషణ్” ఇళయరాజా సంగీత విభావరి , “Melody King” సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్ , భీమ్లా నాయక్ , డి జె టిల్లు తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల సంపాదించి, సంచలనం సృష్టిస్తున్న గాయకుడు రాం మిరియాల అండ్ బ్యాండ్ కోసం ఎంత సేపైనా వేచివుంటామన్న సంగీత ప్రియులు మరి ఇన్ని ప్రత్యేకతలతో , ఇంతమంది ఆటా సైనికులతో పదిహేనువేలమంది సమక్షంలో జులై ఒకటి , రెండు , మూడు తేదీలలో జరుపుకోబోయే ఆటా మహాసభలకు మీరందరు విచ్చేసి , ఆతిధ్యం స్వీకరించి , ఆనందించి , ఆశీర్వదించి , ఆటా అంటే అమెరికాలోని తెలుగు వారందరిదని, ఈ ఆటా 17వ మహాసభలు చరిత్ర లో నిలిచిపోయే విధంగా జరుగబోతుంది.
అమెరికా లో వున్న తెలుగువారందరూ హాజరై భారీ స్థాయిలో ఆట ఉత్సవాలను దిగ్విజయం చేయటానికి PROMO CODE:CATS ద్వారా $20 డిస్కౌంట్ జూలై 2,3 రోజులకు టికెట్స్ కు సహకారం ప్రకటించారు. అందరూ ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించికొని అమెరికా లో వున్న తెలుగువారందరూ హాజరై భారీ స్థాయిలో ఆటా 17వ మహాసభలు విజయవంతం చేయాలని కోరుకున్నారు. టికెట్స్ డిస్కౌంట్ లభించును. www.ataconference.org/buy-tickets మరిన్ని వివరాలకు www.ataconference.org సంప్రదించండి అని నిర్వహకులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
-
Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
-
CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!