Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Khammam Tummala Nageswara Rao Met With Followers Today

Tummala: నేడు అనుచరులతో తుమ్మల భేటీ.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్

Published Date :September 2, 2023 , 11:46 am
By NTV WebDesk
Tummala: నేడు అనుచరులతో తుమ్మల భేటీ.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tummala: పాలేరు అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. తుమ్మల ఈరోజు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్నారు. క్యాంపు కార్యాలయంలో అనుచరులతో ముఖ్యమైన సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ మార్పుపై అనుచరులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత కీలక నిర్ణయం కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. కానీ.. తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? మరి వీరు ఏ పార్టీలో చేరుతారనేది ఉత్కంఠగా మారింది. ఇక మరోవైపు కాంగ్రెస్‌లో చేరాలని తుమ్మల అనుచరులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కీలక నేతలు కూడా తుమ్మలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో అనుచరులతో భేటీ కానున్న తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటిస్తారా? లేక మరేదైనా వ్యూహం ఉందా? అనేది చూడాల్సి ఉంది.

Read also: ప్రెగ్నెన్సీలో వాంతులు.. పరిష్కారానికి చిట్కాలు

బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న తుమ్మలను శాంతింపజేసేందుకు గులాబీదళం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పైగా.. తుమ్మల కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైనట్లు సమాచారం. తుమ్మల ఇంటికి వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. తుమ్మల అభిమానులు కూడా ఆయనను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుతూ…కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6న తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో తుమ్మల కాంగ్రెస్‌లో చేరతారని అంటున్నారు. అయితే.. ఇవాళ అనుచరులతో భేటీ అనంతరం పార్టీ మార్పుపై తుమ్మల అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మలకు పెద్ద ఎత్తున అనుచరులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. కమ్మ సామాజికవర్గంలో ఆయన ఉండడం కూడా పార్టీకి లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. తుమ్మల, రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో కలిసి పనిచేశారు. అప్పట్లో టీడీపీలో కీలక నేత. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తుమ్మల కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Read also: Hyderabad: అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య.. కఠిన నిర్ణయం తీసుకున్న భర్త..!

అయితే తుమ్మల పాలేరు టిక్కెట్టు ఆశిస్తున్నారు. మరోవైపు.. షర్మిల పార్టీ వైఎస్ఆర్టీపీ విలీన ప్రక్రియ కూడా పూర్తి కానుంది. తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరితే పాలేరు నుంచి పోటీ చేస్తానన్నారు. మరోవైపు షర్మిల కూడా పాలేరు స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. పాలేరు సీటు ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాతే రేవంత్ రెడ్డితో భేటీకి తుమ్మల అంగీకరించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆ టికెట్ ఇచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవకాశం మేరకు ఖమ్మంలో పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉండాలని తుమ్మలకి రేవంత్ చెప్పినట్లు సమాచారం. ఖమ్మంలో పోటీకి సిద్ధమైతే ఎన్నికల ఖర్చు చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు వినికిడి. హైదరాబాద్ లోని కూకట్ పల్లి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం తుమ్మలను కోరుతున్నట్లు ప్రచారం జరిగినా.. పాలేరు మినహా మరెక్కడా పోటీ చేసే ఆసక్తి లేదని తుమ్మల స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని, సీటు మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం.
Anasuya : గోల్డ్ శారీలో మెరిసిన అనసూయ..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Samsung Galaxy Z Fold 8: సాంసంగ్ ‘వైడ్’ ఫోల్డబుల్ 5G ఫోన్.. 7.6 అంగుళాల స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో

  • Ram Pothineni: నటుడి నుంచి రచయితగా.. రామ్ పోతినేని సరికొత్త ప్రయోగం!

  • Virat Kohli Fans: మీ అభిమానం తగలేయ్య!!.. పేరెంట్స్ కోహ్లీకి బిగ్ ఫ్యాన్స్.. కుమారుడికి ఏం పేరు పెట్టారో చూడండి..

  • Papam Prathap Trailer: ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ అదిరింది.. తిరువీర్ ఖాతాలో మరో హిట్ పక్కా!

  • Anchor Vishnupriya : అర్ధనగ్న ఫొటోలు పోస్ట్ చేస్తుందని యాంకర్ విష్ణుప్రియపై కేసు నమోదు

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions