TSRTC Special Buses: క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. నేటి నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వెళ్తున్న క్రికెట్ అభిమానులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) శుభవార్త అందించింది. ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్లే క్రికెట్ అభిమానులకు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. జనవరి 25 నుంచి 29 వరకు (ఐదు రోజుల పాటు) నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు 60 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
Read also: IND vs ENG: ఉప్పల్ టెస్ట్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్! కోహ్లీ స్థానంలో రాహుల్
ఆర్‌జిఐసి స్టేడియం మీదుగా ఉప్పల్‌కు సాధారణ సర్వీసులతో పాటు మ్యాచ్ కోసం ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలియజేస్తూ.. నేటి నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ కోసం ఐదు రోజుల పాటు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియంకు 60 బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. ఈ బస్సులు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రారంభమై తిరిగి 7 గంటలకు స్టేడియానికి చేరుకుంటాయి. మ్యాచ్‌ని వీక్షించేందుకు.. ప్రత్యేక బస్సులను ఉపయోగించుకోవాలని క్రికెట్ అభిమానులను TSRTC అభ్యర్థిస్తోంది.
IND vs ENG: ఉప్పల్ టెస్ట్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్! కోహ్లీ స్థానంలో రాహుల్