Hyderabad Police: జీవో నెం.55కి వ్యతిరేకంగా హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. విద్యార్థులకు మద్దతుగా.. నిన్న ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ అక్కడి నుంచి పరుగు తీశారు. అయితే ఝాన్సీని పట్టుకునేందుకు ఇద్దరు మహిళా పోలీసులు స్కూటీపై వెంబడించారు. తన దగ్గరకు రాగానే.. వెనుక ఉన్న పోలీసు తనను అడ్డుకునే ప్రయత్నంలో ఝాన్సీ జుట్టును పట్టుకున్నారు. అయితే.. స్కూటీ నడుస్తుండగా ఝాన్సీ కిందపడిపోయింది. అయినా కూడా ఝాన్సీని వదలకుండా అలాగే జుట్టును గట్టిగా పట్టుకునే వున్నారు. అయితే వెంటనే బండిని ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. స్కూటీని ఆపి ఆమెను అలాగే పట్టుకుని ఉన్నారు. ఝాన్సీ లేచి పోలీసులపై సీరియస్ అయ్యారు.
Read also: Direct Listing : GIFT IFSCలో అంతర్జాతీయ ఎక్స్ఛేంజీలలో భారతీయ కంపెనీల ప్రత్యక్ష జాబితాకు ఆమోదం
ఇలాగేనా మహిళల పట్ల పోలీసులు వ్యవహరించడం అంటూ ఫైర్ అయ్యారు. అవును ఇలాగే ఉంటుంది మరి అంటూ పోలీసులు సమాధానం ఇచ్చారు. అయితే ఈ ఘటనలో విద్యార్థి నాయకుడికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో… ఈ ఘటన ఇప్పుడు వివాదాస్పదమైంది. ఓ విద్యార్థి నాయకురాలిపై ఇంత దారుణంగా ప్రవర్తించడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాస్త కూడా కనికరం లేకుండా జుట్టు పీక్కుని ఈడ్చుకుని వెళ్లడం ఏంటని మండిపడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే ప్రజలపట్ల కటువుగా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఈ భూములను హైకోర్టుకు తీసుకురావద్దని డిమాండ్ చేస్తున్నారు. జీవో నెం.55 ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Maldives-India: భారత్ కు మద్దతుగా నిలిచిన మాల్దీవుల ప్రతిపక్ష పార్టీలు