Prakash Raj: ‘ధురందర్ 2’పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద ట్వీట్.. అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్, మహేశ్‌పై సెటైర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakash Raj: ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ‘ధురందర్ ది రివెంజ్’ చిత్రం బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ రచన, జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, జస్కిరత్, హమ్జా అనే రెండు పాత్రలలో నటించారు. వ్యూహకర్త అజయ్ సన్యాల్ పాత్రలో ఆర్ మాధవన్ తిరిగి రాగా, ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్‌గా అర్జున్ రాంపాల్, ఎస్పీ చౌదరి అస్లాంగా సంజయ్ దత్ నటించారు. అటు కలెక్షనలో ఇటు ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడంలో ధురంధర్ సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘ధురందర్: ది రివెంజ్’ చిత్రాన్ని టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్ , మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసించారు. సోషల్ మీడియా వేదికగా త అభిప్రాయాలను పంచుకున్నారు.
READ MORE: Aishwarya Lekshmi: పెళ్లి కంటే అదే బెటర్.. హీరోయిన్ షాకింగ్ స్టేట్‌మెంట్!
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ చేసిన ఓ ట్వీ్ట్ వివాదానికి దారి తీసింది. రణవీర్ సింగ్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ సాధించినప్పటికీ, మిశ్రమ సమీక్షలను అందుకుంది. చాలా మంది సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని ప్రశంసించగా, ప్రకాష్ రాజ్ మాత్రం భిన్నమైన వైఖరిని వ్యక్తం చేశాడు. ఎక్స్‌లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు. “‘ధురంధర్ 2’ మూవీని అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు వంటి స్టార్స్ అభినందించారు. కానీ బాలీవుడ్ స్టార్స్ ఎవరైనా ట్వీట్ వేశారా?” అని ఓ నెటిజన్ ప్రకాష్ రాజ్‌ను ప్రశ్నించాడు. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ ‘దక్షిణాదికి సైతం అబ్లికేషన్ అనేది వ్యాపించినట్టుగా ఉంది’ అని ఆన్సర్ ఇచ్చాడు. అంటే ఎవరో చెప్పడం వల్లే టాలీవుడ్ ఇంతగా స్పందిస్తుందనే అర్థం వచ్చేలా రిప్లై ఇచ్చాడు. తాను ధురంధర్-2కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపాడు. మీరు కూడా దూరంగా ఉంటారా? అని #justasking”లో నెటిజన్లను అడిగారు. మరోవైపు.. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్ స్పందించడం లేదేమిటని ప్రశ్నిస్తున్నారు.
Signs of Obligations are spreading South too .. #justasking https://t.co/iB01E1sp7K
— Prakash Raj (@prakashraaj) March 19, 2026
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!