Group-1 Prelims: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఫలితాల అనంతరం రద్దు చేశారు.
ఈ నెల 16 న గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు. హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకొని వారు వెంటనే చేసుకోవాలని, తప్పులు ఉంటే గెజిటెడ్ అధికారి సంతకం చేయించుకొని రావాలని సూచించారు.. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారన్నారు. పదింపావు తరవాత ఎవరిని సెంటర్లలోకి అనుమతించమని చెప్పారు. ఈ సారి బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుందని, బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్…