తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ IV సర్వీసుల రిక్రూట్‌మెంట్‌కు మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (MJPTBCWREIS)లో మరో 141 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను చేర్చింది. దీనితో కలిపి మొత్తం 430 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కానున్నాయి. దీని ప్రకారం, MJPTBCWREIS లో ఇప్పటికే ఉన్న 289 ఖాళీలకు 141 ఖాళీలను జోడిస్తూ శనివారం గ్రూప్-IV సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కు కమిషన్ అనుబంధాన్ని జారీ చేసింది. గ్రూప్-IV సర్వీసుల్లో మొత్తం 8,180 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-IV నోటిఫికేషన్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కొత్తగా జోడించిన ఖాళీల కోసం కూడా పరిగణనలోకి తీసుకుంటారని కమిషన్ తెలిపింది. శనివారం చివరి కౌంటింగ్ వరకు మొత్తం 7,41,159 మంది అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు జనవరి 30 సాయంత్రం 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read : Mahesh Vs Prabhas: ‘ఒరేయ్’.. మీ దుంపలు తెగ.. ఫ్యాన్స్ వార్ అని పచ్చిగా తిట్టుకుంటారేంటిరా
ఇదిలా ఉండగా.. జనవరి 27న తెలంగాణ(Telangana) ఆర్థిక శాఖ 2,391 పోస్టులకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్థికశాఖ ఇప్పటికే 60,929 ఉద్యోగాలకు అనుమతి ఇవ్వగా.. ఇప్పుడు కొత్తగా అనుమతి ఇచ్చిన 2,391 ఉద్యోగాలను కలిపితే మొత్తం 63,320 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ 2,391 ఉద్యోగాలలో బీసీ గురుకుల విద్యాలయాల్లో అత్యధికంగా 1,499 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను గురుకుల నియామక మండలి ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పటికే గురుకుల పోస్టులు 10వేలకు పైగా ఆర్థిక శాఖ ఆమోదించింది. వాటితో పాటు.. ఇవి అదనంగా ఉన్నాయి. ఇక ఈ 1499 పోస్టుల్లో టీచింగ్ పోస్టులతో పాటు.. నాన్ టీచింగ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.
Also Read : Singareni : సింగరేణి థర్మల్ ప్లాంట్ రిజర్వాయర్‌లో మొట్టమొదటి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్