ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలోని భారత్ మండపంలో విద్యార్థులతో పరీక్షల(పరీక్షా పే చర్చ 2024) గురించి చర్చించారు. పరీక్షల టెన్షన్‌ను తొలగించేందుకు విద్యార్థులతో ప్రధానమంత్రి ముచ్చటించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషించారు. ప్రధాన మంత్రి అనేక ఉదాహరణలు ఇవ్వడం ద్వారా పిల్లలను ప్రేరేపించారు. ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
లాక్ డౌన్.. పేరు చెబితే జనం ఉలిక్కిపడుతుంటారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధిస్తే వేలాదిమంది చనిపోయారు. వైరస్ కంటే లాక్ డౌన్ కారణంగా తిండి లేక, తమ స్వస్థలాలకు వెళుతూ దారిలో ప్రాణాలు పోయిన అభాగ్యులెందరో. అయితే శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామంలో ఇప్పటికీ లాక్ డౌన్ అమలవుతోంది. 8రోజుల పాటు ఎవరూ ఊరి పొలిమేర దాటకుండా… బయటవారిని లోపలికి రానీయకుండా గ్రామస్తులు స్వీయ నిర్భందం విధించుకున్నారు. దుష్టశక్తులు పీడిస్తున్నాయని నమ్మిన జనం,…
కరోనా సమయంలో రైళ్ల కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలోనూ ఇండియన్ రైల్వేకు భారీ ఆదాయం సమకూరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తత్కాల్, ప్రీమియం టికెట్ల విక్రయాల ద్వారా రైల్వేకు రూ.500 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఏడాదిలో తత్కాల్ టికెట్ల ద్వారా రూ.403 కోట్లు, ప్రీమియం తత్కాల్ టికెట్ల ద్వారా రూ.119 కోట్ల ఆదాయాన్ని రైల్వేశాఖ ఆర్జించింది. Read Also: వైరల్: బైకుపై హీరో లెవల్లో గన్‌తో… కట్ చేస్తే…!…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ముప్పు తగ్గుతుందని భావిస్తున్న వేళ.. మరోసారి కరోనా వైరస్ మహమ్మారి ప్రజలపై విరుచుకుపడుతోంది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే రష్యా, జర్మనీ వంటి దేశాలలో ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా యూరప్‌లోని ఆస్ట్రియా దేశంలో రోజుకు 15వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆస్ట్రియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Read Also: బిగ్ బాస్ హౌస్ లో అడల్ట్…
కరోనా లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలకు నటుడు సోనూసూద్ సేవలు అందించిన విషయం అందరికీ తెలిసిందే. సోమవారం హైదరాబాద్ నగరంలోని హెచ్‌ఐసీసీలో కోవిడ్ వారియర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా… మంత్రి కేటీఆర్, నటుడు సోనూసూద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనూసూద్‌కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే అతడిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే సోనూసూద్ ఇళ్లపై ఐటీ దాడులు, ఈడీ దాడులు చేయించారని…
సూర్యపేట జిల్లా కోదాడ మండలం రామాపురం ఎక్స్ రోడ్డు వద్దా తెలంగాణ- ఆంధ్రా అంతరాష్ట్ర సరిహద్దులో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. తెలంగాణలోకి రావాలంటే లాక్ డౌన్ మినహాయింపు సమయంలో కూడా ఈ-పాస్ ఉన్న వారినే పంపిస్తున్నారు పోలీసులు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ లకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. పాసులు లేకపోవడంతో చాలా వాహనాలు నిలిపివేస్తున్నారు పోలీసులు. బైక్, ఆటోలతోసహ అన్ని వాహనాలను నిలిపివేయడంతో భారీగా నిలిచిపోయాయి వాహనాలు. అయితే నిన్నటి నుండి రాష్ట్రంలో ఆంక్షలు మరింత…
దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా గత ఏడాది మంచి ముహూర్తాలు వున్నా.. పెళ్లిళ్లలను చాలా మంది తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ మంచి ముహుర్తాలే ఉండటంతో ఎలాంటి హడావుడి లేకుండా వివాహాలు జరుగుతున్నాయి. ఎక్కువ మంది అతిథులు లేకున్నా.. మండపాలు లేకున్నా చాలా చోట్ల ఇండ్లల్లో, గుళ్ళల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పరిమిత సంఖ్యలో నిబంధనలు ఉండటంతో తక్కువ మంది…