ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ యూజర్స్ సేఫ్టీ కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు.. యూజర్ల ప్రైవసీకే వాట్సాప్ పెద్దపీట వేస్తోంది. ఈ విషయంలో మెటా యాజమాన్యంలోని వాట్సాప్ అసలు కాంప్రమైజ్ అవ్వలేదు.. ప్రైవసీకి సంబందించిన సమస్యలను అధిగమించడానికి తగిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వాట్సాప్ వెబ్ వెర్షన్ కోసం చాట్ లాక్ ఫీచర్‌పై పనిచేస్తోంది. వినియోగదారులు వారి ఫోన్ నంబర్‌లను షేర్ చేయకుండా ఇతరులతో కనెక్ట్ అయ్యేందుకు వీలుగా ఉంటుంది.. అందుకోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని రానున్నారు..
ఈ వాట్సాప్ త్వరలో ఇతర వినియోగదారుల ప్రొఫైల్ ఫొటోల స్క్రీన్‌షాట్‌లను తీయకుండా యూజర్లను బ్లాక్ చేయనుందని వాట్సాప్ నివేదిక తెలిపింది. ఇప్పటివరకు, వాట్సాప్ గుర్తుతెలియని యూజర్ల నుంచి ప్రొఫైల్ ఫొటోలను హైడ్ చేసే ఆప్షన్ కలిగి ఉంది.. వేరే వినియోగదారులు మన డిపి ని స్క్రీన్ షాట్ తీసుకొనే వీలు ఉండదని తెలుస్తుంది.. ప్రస్తుతం ప్రొఫైల్ ఫొటోలను వేరే యూజర్స్ స్క్రీన్‌షాట్‌లు తీయకుండా ఉండేందుకు కొత్త బ్లాకింగ్ ఫీచర్‌పై టెస్టింగ్ చేస్తోంది. వాట్సాప్ కు ఈ సరికొత్త ఫీచర్ యాడ్ అయితే వ్యక్తిగత ఫోటోల డౌన్‌లోడ్, షేరింగ్ చేయకుండా నియంత్రించవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఇటీవలే వాట్సాప్ బీటా, గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
Also Read: Yamaha RX100 New Avatar : యూత్ ను ఆకట్టుకుంటున్న బైక్.. ఫీచర్స్,ధర ఎంతంటే?
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ప్రొఫైల్ ను స్క్రీన్ షాట్ తియ్యడం అసలు కుదరదు.. ఫొటోలను స్క్రీన్‌షాట్ పరిమితం చేయడం వెనుక ఉద్దేశ్యాన్ని వాట్సాప్ స్పష్టం చేసింది. వాట్సాప్ ప్లాట్‌ఫారంలో వేధింపుల ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా స్క్రీన్‌షాట్ బ్లాక్ ఫీచర్ తీసుకొస్తోంది. ప్రస్తుతం ఎంచుకున్న బీటా టెస్టర్‌ల గ్రూపుకు మాత్రమే ఈ ప్రైవసీ ఫీచర్ అందుబాటులోకి రానుంది.. త్వరలోనే వాట్సాప్ అందరూ యూజర్స్ కు అందుబాటులోకి రానుంది..