తెలంగాణలో గత మూడు, నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. నిన్న వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడంతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా.. ఉస్మానియా, కాకతీయ యూనివర్సీటీలకు సైతం ఈ మూడు రోజులు సెలవులు ప్రకటించడమే కాకుండా.. ఈ మూడు రోజుల్లో జరిగే షెడ్యూల్ట్ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీల్లో జరగాల్సి అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆయా విద్యాసంస్థలు ప్రకటించాయి.
ఇదిలా ఉంటే.. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించించే ఈ సెట్, ఎంసెట్ పరీక్షలు ఈ నెల 13, 14వ తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే.. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వాహణపై మధ్యాహ్నం ఉన్నత విద్యామండలి సమావేశమైంది. అయితే మండలిలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సెట్ ల వాయిదా పై నిర్ణయం తీసుకుంటామని ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 13న నిర్వహించాల్సిన ఈ సెట్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు అధికారులు. అయితే ఈ నెల 14న నిర్వహించనున్న ఎంసెట్ పరీక్షలు మాత్రం యథాతధంగా కొనసాగుతాయని వెల్లడించారు. అయితే దీనిపై మరికాసేట్లో అధికారిక ప్రకటన చేయనున్నారు.