Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Trs Protests Against Modi Govt Attitude

TRS Protest: అడుగడుగునా నల్లజెండాలతో నిరసన

Published Date :April 8, 2022 , 10:58 am
By NTV WebDesk
TRS Protest: అడుగడుగునా నల్లజెండాలతో నిరసన
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి కేంద్ర వైఖరిని టీఆర్‌ఎస్ తప్పుబడుతోంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మొన్న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టిన టీఆర్‌ఎస్‌. గురువారం రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారులను దిగ్భందించింది. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. వడ్ల కొనుగోలు పై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ మంత్రి హరీష్ రావు ఇంటిపై నల్ల జెండా ఎగరవేశాయి టీఆర్ఎస్ శ్రేణులు. సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి పైన నల్ల జెండా ఎగరవేశారు రైతులు.

నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో రైతులు, వ్యవసాయ కూలీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ తమ ఇళ్ల పై నల్ల జెండాలను ఎగురవేసి నిరసనను వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యకులు మధు సూధన్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో ముంబై జాతీయ రహదారి పై కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను తగుల బెట్టారు.

ఖమ్మం జిల్లా మధిర (మం) రాయపట్నంలో కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయనందుకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ లో నల్లజెండాను ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. టీఆ‌ర్‌‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసి‌డెంట్ కేటీఆర్‌ పిలు‌పు‌ మేరకు రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, కార్యకర్తలు, రైతుల ఇళ్లపై నల్లజెండాల నిరసన కొనసాగుతోంది.

https://ntvtelugu.com/gap-between-ts-govt-and-governor-tamilisai/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • balck jenda
  • Farmers
  • ktr
  • modi
  • paddy issue

తాజావార్తలు

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • Sai Marthand: అడివి శేష్‌తో ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడి నెక్స్ట్ మూవీ.. అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది!

  • Chairman’s Desk : పేదరికం లేని రాష్ట్రం ఎలా సాధ్యమైంది? వరుస విజయాల వెనకున్న కథేంటి?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions