టీఆర్ఎస్ దూకుడు..! కేంద్రంపై మరో పోరాటం..
కేంద్రంపై మరో పోరాటానికి రెడీ అవుతోంది టీఆర్ఎస్ పార్టీ… పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దూకుడు పెంచాలని అధిష్టానం నిర్ణయించింది. కేంద్ర వైఖరిపై గట్టిగా పోరాడాలని సిగ్నల్స్ రావడంతో… ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టారు టీఆర్ఎస్ ఎంపీలు. ఈ నెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి... దాంతో గులాబీ పార్టీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు మొదలుపెట్టింది. విభజన చట్టం అమలు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని నిలదీయాలని భావిస్తోంది. ఇక పార్లమెంట్ సమావేశాల కంటే ముందు కేసీఆర్ దిశానిర్దేశంతో పార్లమెంట్ సమావేశాలల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మరింత క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత అప్పడు ఉన్న రాజకీయ పరిణామాలను బట్టి… ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు సాగడంపై నిర్ణయాలు ఉంటాయని గులాబీ పార్టీ వర్గాలు అంటున్నాయి.
Read Also: తాజా సర్వే: తెలంగాణలో పుంజుకున్న బీజేపీ.. ఆ ఇద్దరికి షాక్..!
ఇక, గడిచిన పార్లమెంట్ సమావేశాలలో ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పలు అంశాలపై ఎన్డీఏ సర్కార్ ను ఇబ్బంది పెట్టేలా టీఆర్ఎస్ ఎంపీలు దూకుడుగా వ్యవహరించారు. అప్పట్లో ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. పార్లమెంట్ సమావేశాలు కొనసాగినన్ని రోజులు టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇవ్వడంతో పాటు…సభా కార్యకలాపాలను అడ్డుకున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Smriti Irani: మహిళల హక్కులు హరించి సంబరాలా? కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
Slum Dog Release: పూరీ-విజయ్ ‘స్లమ్ డాగ్’ రిలీజ్ ఆలస్యం.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
-
CM Revanth Reddy : బయ్యారం ఉక్కు.. హైదరాబాద్ ఈవీ హబ్..
-
Kiren Rijiju: బిల్లు వీగిపోవడంపై సంబరాలు దురదృష్టకరం.. కాంగ్రెస్‌పై కిరణ్ రిజిజు ధ్వజం
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!