హుజురాబాద్ ఉప ఎన్నిక రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెంచుతోంది… ఆరోపణలు, విమర్శల పర్వం ఊపందుకోగా… ఇక, తాజాగా ఫిర్యాదుల పర్వానికి తెరలేచింది.. ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఎస్పీ తదితర అధికారులపై ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా.. తాజాగా.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, ఆ పార్టీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది అధికార టీఆర్ఎస్ పార్టీ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అసత్య ఆరోపణలు, తీవ్ర నేరారోపణతో కూడిన కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ బీజేపీ అభ్యర్థి ఈటలపై, బీజేపీపైన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్.. ఇక, టీఆర్ఎస్ పార్టీ, పార్టీ హుజురాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై బీజేపీ అభ్యర్థి దుష్ప్రచారం చేస్తూ లబ్ధిపొందే ప్రయత్న చేస్తున్నారని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నేత జగన్ పై బీజేపీ నేతల దాడిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ పార్టీ.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ రోడ్ షోలు నిర్వహించడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.. టీఆర్ఎస్ డబ్బులు ఇస్తుందని దుష్ప్రచారం చేయడంతో పాటు, డబ్బులు తీసుకోమని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటర్లును తప్పుదోవ పట్టించడం, టీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేయడంపైన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందింది.. అన్ని కేసులపై ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్.