కాంగ్రెస్‌లో చేరితే డీఎస్‌పై అనర్హత వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరికకు ఇప్పటికే అంతా సిద్ధమైంది. అయితే, అనుకోని కారణాలతో పలుమార్లు చేరిక వాయిదా పడుతు వస్తోంది. రేపో మాపో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న డీఎస్ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ ఆయనపై గుర్రుగా ఉంది. దీంతో అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది. ప్రగతి భవన్‌లో నిన్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటులో టీఆర్ఎస్ సత్తా చాటాలని, అస్సలు వెనక్కి తగ్గొద్దని సూచించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దని, గట్టిగా పోరాడాలని సూచించారు. ఈ సందర్భంగా డి.శ్రీనివాస్ ప్రస్తావన వచ్చింది.
Read Also:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలి: కేటీఆర్
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం జూన్ వరకు ఉందని, ఈలోపు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటే అనర్హత వేటు వేయాలన్న ప్రతిపాదనను ఎంపీలు కేసీఆర్ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. అనర్హత వేటు కోసం రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఫిర్యాదు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చ అనంతరం డీఎస్ కాంగ్రెస్‌లో చేరిన మరుక్షణం అనర్హత వేటు కోసం ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా డీఎస్‌కు టీఆర్‌ఎస్ పార్టీలో సరైన ప్రాతినిథ్యం లేని కారణంగా ఆయన సొంత గూటికీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు కొడుకు అరవింద్ బీజేపీలో కొనసాగుతున్నారు. గతంలో నిజామాబాద్ ఎంపీ స్థానానికి కవితపై అరవింద్ పోటీ చేశారు. ఈ విషయం అప్పటి నుంచి డీ శ్రీనివాస్‌కు టీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యతను తగ్గిస్తు వచ్చారు గులాబీ బాస్ కేసీఆర్.
- Tags
- congress
- d.srinivas
- telangana
- TRS
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!