ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2022 ఫలితాలు విడుదలయ్యాయి.. పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలిసెట్-2022 ఫలితాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు.. పాలిసెట్ 2022లో 91.84 మేర అర్హత సాధించారు విద్యార్థులు, పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు మే 29న పాలిసెట్ నిర్వహించారు.. ప్రవేశ పరీక్షకు 1,38,189 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,31,627 మంది అర్హత సాధించారు.. ఇక, పాలిటెక్నిక్ కళాశాలలో 1,20,866 మంది ప్రవేశం పొందారు.. బాలురలో 90.56 శాతం మంది అర్హత పొందగా.. బాలికల్లో 93.96 మంది అర్హత సాధించారు.
Read Also: Vijaya Sai Reddy: ముసలాడికి గాలి సోకిందో ఏమో..? చంద్రబాబుపై సాయిరెడ్డి కౌంటర్
ఇక, నూరుశాతం అర్హత సాధించారు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు.. రాజమండ్రి రూరల్ కు చెందిన చల్లా సత్య హర్షిత ప్రథమ అర్హత పొందగా.. కాకినాడకు చెందిన అల్లూరి హృతిక్ సత్య నిహాoత్‌కు రెండో ర్యాంక్ సాధించారు. కాకినాడకు చెందిన టెంకని సాయి భవ్యశ్రీ తృతీయ ర్యాంక్ పొందారు.. మొత్తంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. సంబంధిత వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ వివరాలు, పుట్టిన తేదీని ఎంటర్ చేయడం ద్వారా పాలిసెట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు అని అధికారులు వెల్లడించారు.