Boys Transfer: గజిని సినిమా ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే. అందులో రైలులో బాలికలను తరలిస్తున్న సీన్ తో అంత సినిమా సాగుతుంది. హీరోయిన్ ఆసిన్ ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు కొందరు అమ్మాలను వేరే చోటుకి తరలిస్తున్న దృశ్యం ఆమె కంటపడటం వాళ్లను రక్షించే ప్రయత్నంలో రౌడీలకు తనకు మధ్య సన్నివేశాలు హైలెట్ అయితే.. వారందరిని రక్షించేందుకు ఫౌజీ సోదరులు ఎంట్రీ ఇవ్వడం ఇంకో హైలెట్ సీన్ గా నిలిచింది.
Read also: Shashank Singh: కన్ఫ్యూజిన్‌లో జట్టులోకి వచ్చి ‘పంజాబ్’ హీరో అయ్యాడు.. ఎవరీ శశాంక్ సింగ్?
అయితే అప్పటి నుంచి సినిమా వీరలెవల్ లో మలుపులు తిరుగుతుంది. ఆసిన్ కు రౌడీ మూక టార్గెట్ చేయడం, ఆమెను చంపేందుకు ఇంటికి వెళ్లిడం.. అక్కడ హీరో సూర్య ఉండటం ఇక కథఅంతా ఓ రేంజ్ లో ఉంటుంది. ఇలాంటి ఘటనే కాజీపేట రైలులో చోటుచేసుకుంది. కానీ.. ఆసిన్ కాపాడేది బాలికలైతే.. ఇక్కడ రైలులో బాలురను కాపాడేది పోలీసులు.. సుమారు 11 మందిని బాలురను తరలిస్తున్నట్లు గమనించిన పోలీసులు వారిని అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read also: liquor Smuggling: ఇదేందయ్యా ఇది ఎప్పుడు చూడలే.. బనియన్ కు 54 జేబులు.. వాటిల్లో..?!
హన్మకొండ జిల్లా కాజీపేట రైలులో తరలిస్తున్న బాలకార్మికులను పోలీసులు పట్టుకుని చైల్డ్ లైనుకు అప్పగించారు. గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య నడిచే గోరఖ్‌పూర్ ఎక్సప్రెస్ రైలులో గురువారం వివిధ ప్రాంతాల నుంచి బాలురను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో కాజీపేటలో ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 11 మంది బాలురు, వారిని తరలిస్తున్న ఐదుగురిని అదుపులో తీసుకున్నారు. వారందరిని విచారించగా.. పోలీసులు షాక్ అయ్యారు. వేసవి సెలవులు ఉన్నందున బీహార్, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ లో పని చేయించేందుకు బాలురలను తరలిస్తున్నట్లు తెలిపారు.
బాలురను తరలించేందుకు కూడా రవాణాదారులు ఒప్పుకున్నట్లు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు వీరందరిని దర్యాప్తు చేస్తున్నారు. పనిచేసేందుకే హైదరాబాద్ కు తరలిస్తున్నారా? లేక ఇంకా ఏమైనా చేసేందుకు తరలిస్తున్నారా? అనే అనుమానంతో విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే డ్రగ్స్ పేరుతో హైదరాబాద్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే… ఆకోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
CSK Biryani Party: తెలుగోడి ఆతిథ్యం అంటే ఆ మాత్రం ఉంటది బాసూ.. బిర్యానీ పార్టీలో పాల్గొన్న ఆటగాళ్లు..!