Khammam Traffic Restrictions: కనివినీ ఎరుగని రీతిలో ఖమ్మం సభ.. ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam Traffic Restrictions: ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంలో ఈ నెల 18న కనీవినీ ఎరగని స్థాయిలో బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దేశం మెచ్చేలా సభకు సన్నాహాలు చేస్తోంది. సభకు రెండు రోజుల ముందే ఖమ్మం నగరం భారీ కటౌట్లు, హోర్డింగ్‌లతో గులాబిమయమైంది. ఈ సభకు సుమారు 5 లక్షల మంది జనసమీకరణ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. ఈ బహిరంగ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అయితే.. రేపు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఖమ్మంలో ట్రాఫిక్ నిబంధలు ఉంటాయని ట్రాఫిక్ పోలీస్ వెల్లడించారు.
ఖమ్మం సభ ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ డైవర్షన్..
Also Read
మీటింగ్ వచ్చే ప్రజలు పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు నిలిపి మీటింగ్ స్థలానికి చేరుకోవచ్చని పోలీసుల స్పష్టం చేశారు. భారీ వాహనాలదారి మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. భారీ వాహనాలు వెళ్లే హైవే లో లారీలు, హైదరాబాద్, వరంగల్ వైపు వెళ్లే డీసీఎంలు బోనకల్ చిల్లకల్లు వైపు మళ్లించనున్నారు. ఏనుకూరు నుంచి జన్నారం వైపు వెళ్లే భారీ వాహనాలను వైరా-బోనకల్ వైపు. వైరా వైపు వస్తున్న భారీ వాహనాలు చింతకిని వైపు బోనకల్ రోడ్డు వైపు మళ్లుతున్నాయి. యెల్లందు వైపు నుంచి భారీ వాహనాలను ఎన్టీఆర్ సర్కిల్- రాపర్తినగర్ పాస్‌రోడ్డు మీదుగా హైద్, డబ్ల్యూఆర్ఎల్ రోడ్డు వైపు మళ్లిస్తారు. NTR సర్కిల్లోని వాహనాలు..రాపర్తినగర్‌లోని వాహనాలను బైపాస్ రోడ్డు మీదుగా హైదరాబాద్ రోడ్డుకు మళ్లించనున్నారు.
Read also: Master Plan: నేడు మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం… ఉద్యమం ఉదృతంపై చర్చ
మహబూబాబాద్ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ఏదులాపురం, రూరల్ పీఎస్ సర్కిల్ వైపు కోదాడ వైపు నుంచి విజయవాడ హైవే వైపు మళ్లించారు. కోదాడ ఎక్స్ రోడ్ సర్కిల్, ఏదులాపురం ఎక్స్ రోడ్ వైపు. వరంగల్ వైపు నుంచి వస్తున్న భారీ వాహనాలు రూరల్ పీఎస్ సర్కిల్ వైపు మళ్లించి కోదాడ వైపు నుంచి విజయవాడ హైవే వైపు మళ్లించనున్నారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వచ్చే భారీ వాహనాలు గుర్రాలపాడు-వెంకటగిరి ఎక్స్‌రోడ్డు-కోదాడ వైపు-విజయవాడ హైవే వైపు. వెంకటగిరి ఎక్స్ రోడ్ జంక్షన్, కోదాడ వైపు నుంచి వస్తున్న భారీ వాహనాలను ఖమ్మం టౌన్లోకి అనుమతించడం లేదన్నారు. నాయుడుపేట జంక్షన్, ఏన్కూరు కేంద్రం, బోనకల్ సెంటర్ వైపు. ఖమ్మం టౌన్లో భారీ వాహనాలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. ఖమ్మం వెళ్లే వాహనాలను తిమ్మరావుపేట, ముచ్చర్ల ఎక్స్ రోడ్డు-ఎన్టీఆర్ సర్కిల్ వైపు. భారీ వాహనాలను ఖమ్మం రోడ్డుకు అనుమతించడం లేదు. కావున ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలందరూ వేరే మార్గాల ద్వారా మీ గమ్యాన్ని చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
Three State CMs: ఇవాళ హైదరాబాద్‌కు మూడు రాష్ట్రాల సీఎంలు.. స్వాగతం పలకనున్న తెలంగాణ మంత్రులు
తాజావార్తలు
-
Melania Trump: ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై మెలానియా ట్రంప్ కీలక ప్రకటన
-
Afghanistan Tri Series Win: అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్థాన్.. ట్రై సిరీస్ కైవసం..
-
Ishan Kashan Replace: గాయంతో మ్యాచ్‌కు దూరమైన ఇషాన్ కిషన్.. అతడి స్థానంలో కీలక ప్లేయర్‌ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ..
-
IND vs NZ 2nd T20I: నేడు భారత్-న్యూజిలాండ్ రెండో టీ20.. లైవ్ స్ట్రీమింగ్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 ఇదే!
-
Ankeet Bawane: వరుసగా రెండు సెంచరీలు (150+, 200).. రంజీల్లో తిరుగులేని ప్లేయర్‌గా రికార్డు..
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!