Revanth Reddy: తెలుగువాళ్లు అంటే మోడీకి చిన్న చూపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగువాళ్లు అంటే మోడీకి చిన్న చూపు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగువాడు ఉన్నత స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడిని అవమానించారు మోడీ అంటూ ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. ఏపీకి మంత్రి లేడని తెలంగాణకి ఉన్నా లాభం లేదంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఉన్న ఒక్క దత్తాత్రేయ నీ తీసేశారని, బీజేపీ కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిందని, అప్పుడు ప్రజలను వంచించింది బీజేపీ అని ఆయన ఆరోపించారు. 7గురు ఎంపీలు గెలిచి ప్రజలను మోసం చేసిన పార్టీ బీజేపీ అని.. మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి.. తెలంగాణ మాటే ఎత్తలేదన్నారు. ఆంధ్రలో పార్టీ నీ చంపుకుని తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని.. తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇచ్చారు సోనియా గాంధీ అని ఆయన వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో మోడీ తెలంగాణ మనుగడనే విమర్శించారన్న రేవంత్ రెడ్డి.. తల్లిని చంపి పిల్లను ఇచ్చారు అని మోడీ అన్నారని గుర్తు చేశారు.
పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చిన రోజు చీకటి రోజు అని మోడీ మాట్లాడారని, తెలంగాణకి బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ.. గిరిజన యూనివర్సిటీ.. ఐటీఐఆర్‌నీ ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన తెలిపారు. పార్లమెంట్‌లో ఆమోదించిన అంశాలు మోడీ ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఖాజీ పేట రైల్వే కోచ్ గురించి అడిగినా మోడీ స్పందించలేదని, తెలంగాణకి తీవ్ర అన్యాయం చేసింది అని పార్లమెంట్‌లో గుర్తు చేస్తే అసలు పట్టించుకోలేదన్నారు. తెలంగాణకి న్యాయం చేయకపోగా.. తెలంగాణ ఏర్పాటును తప్పు పట్టి తెలంగాణ ఆత్మగౌరవంనీ దెబ్బ తీశారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు ఏమైందని, స్విస్ బ్యాంక్ డబ్బులు వెనక్కి తెస్తా అన్నారు ఏమైందని ఆయన సెటైర్లు వేశారు.
Also Read
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
తాజావార్తలు
-
Economic D-Day: ఇరాన్‌కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స!
-
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!