TPCC Mahesh Goud : జీవన్ రెడ్డికి అన్ని ఇచ్చింది కాంగ్రెస్సే.. ఆధారాలు ఉంటే గాంధీ భవన్‌కు రండి
- జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ కౌంటర్
- పొంగులేటిపై ఆరోపణలు… ఆధారాలు చూపాలంటూ సవాల్
- బీఆర్ఎస్ పాలనపై మహేష్ గౌడ్ విమర్శలు
- డిప్యూటీ సీఎం రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన పీసీసీ అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలు, ప్రతిపక్షాల విమర్శలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణ, ప్రభుత్వ పనితీరు , భవిష్యత్తు కార్యాచరణపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఎపిసోడ్‌పై స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని మహేష్ గౌడ్ గుర్తు చేశారు. “జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏకంగా 14 సార్లు బీ-ఫాం ఇచ్చింది. ఆయన రాజకీయ ఎదుగుదలకు పార్టీ ఎంతో కృషి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు. అటువంటి నేతపై ‘రేవంత్ పోవాలి.. మార్పు రావాలి’ అని మాట్లాడటానికి జీవన్ రెడ్డి ఎవరు?” అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ చేసిన అవినీతిని జీవన్ రెడ్డి స్వయంగా అనేకసార్లు విమర్శించారని, ఇప్పుడు పార్టీ లైన్ దాటి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వస్తున్న అవినీతి ఆరోపణలను పీసీసీ చీఫ్ తోసిపుచ్చారు. ప్రతిపక్షాలు కేవలం బురదజల్లే రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. “పొంగులేటి అవినీతిపై ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే నేరుగా గాంధీ భవన్‌కు రండి. చర్చకు నేను సిద్ధం, నా సవాల్‌ను స్వీకరించండి. పక్కా ఆధారాలు చూపిస్తే ప్రభుత్వం తరపున కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అంతే తప్ప, బట్టకాల్చి మీద వేస్తామంటే కుదరదు” అని స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మంత్రులు జేబులు నింపుకున్నారని, నాసిరకం ప్రాజెక్టులు కట్టి ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. నాటి దోపిడీ గురించి ఇప్పుడు కవిత కూడా చెబుతున్నారని, అప్పట్లో దోచుకున్న వారు నేడు మా మంత్రులపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
మహేష్ కుమార్ గౌడ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కబోతోందంటూ వస్తున్న వార్తలపై ఆయన ఆసక్తికరంగా స్పందించారు. “నాకు డిప్యూటీ సీఎం పదవి వస్తుందని వస్తున్న వార్తలు చూస్తుంటే సంతోషంగా ఉంది. కానీ, ఆ వార్తలు ఎందుకు రాస్తున్నారో, దేని ఆధారంగా రాస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండటమే నాకు అత్యంత సంతృప్తినిస్తోంది. మంత్రి పదవుల కంటే పీసీసీ పదవే బెటర్ అని నా భావన. మంత్రి పదవుల భర్తీ అనేది పూర్తిగా ఏఐసీసీ (AICC) పరిధిలోని అంశం. ప్రస్తుతానికి పార్టీ కోసం పనిచేస్తూ, సంస్థను బలోపేతం చేయడమే నా లక్ష్యం” అని క్లారిటీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని, తాను పీసీసీ అధ్యక్షుడిగానే కొనసాగుతానని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!