Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion Rice Recipe: ప్రతిరోజూ ఉదయం పిల్లల లంచ్ బాక్స్ కోసం తల్లులు పడే కష్టాలు వర్ణనాతీతం. పోషకాహారం, రుచి, కొత్తదనం, సమయం, పిల్లల ఇష్టాయిష్టాలను బ్యాలెన్స్ చేయడం వారికి పెద్ద సవాలుగా మారుతుంది. రోజూ ఏం పెట్టాలి? అనే ఆలోచన, ఒకే రకమైన ఆహారం పెడితే పిల్లలు తినకపోవడం, బాక్స్ ఖాళీ చేయకపోవడం వంటివి తరచూ జరుగుతుంటాయి. పిల్లలను నిద్రలేపి, తయారీ చేసి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్స్ సిద్ధం చేయడానికి టైమ్ సరిగ్గా సరిపోదు. అలాంటి వాళ్ల కోసం ఓ మంచి రెసిపీని తీసుకొచ్చాం. ఉదయాన్నే హడావిడిలేకుండా 10నిమిషాల్లో చేసుకొనే లంచ్ బాక్స్ రెసిపీల్లో ఉల్లిపాయ అన్నం (Onion Rice) ఒకటి. దీన్ని ఎంతో ఈజీగా, తక్కువ సమయంలో చేసుకోగలం. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మీ పిల్లలు టిఫిన్ బాక్స్ ఖాళీ చేయడం పక్కా! ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
READ MORE: Supreme Court: మహాభారతం పోరాటంలాగా ఉంది.. విడాకులిస్తూ సుప్రీంకోర్టు అసహనం
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
కావలసిన పదార్థాలు:
అన్నం: ఒక పెద్ద కప్పు (ముందే వండినది)
ఉల్లిపాయలు: 2 పెద్దవి (పొడవుగా కోసిన ముక్కలు)
పచ్చిమిర్చి: 2-3
మసాలా దినుసులు: ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు
రుచికి సరిపడా: ఉప్పు, చిటికెడు పసుపు, కారం
నూనె లేదా నెయ్యి: సరిపడా
తయారీ విధానం:
పోపు పెట్టడం: ముందుగా బాణలిలో నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆపై కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు సన్నగా, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అన్నానికి అంత మంచి రుచి వస్తుంది.ఉల్లిపాయలు వేగాక అందులో పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. ఇప్పుడు ముందే వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి, మసాలాలన్నీ అన్నానికి బాగా పట్టేలా మెల్లగా కలుపుకోవాలి. రెండు నిమిషాల పాటు తక్కువ మంట మీద వేడి చేసి, చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి ఆనియన్ రైస్ సిద్ధం! ఈ ఉల్లిపాయ అన్నాన్ని చల్లని రైతా (పెరుగు పచ్చడి), అప్పడం లేదా ఆవకాయతో కలిపి తింటే అమృతంలా ఉంటుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!