Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free House and Job: ఉచితంగా ఇల్లు ఓ ఉద్యోగం ఇస్తారంటే ఎవరైనా ఎందుకు వద్దంటారు. ఓటేసి ఎంచుకున్న ప్రభుత్వాలే ప్రజల్ని సరిగ్గా పట్టించుకోని ఈ రోజుల్లో ఇలాంటి బంపర్ ఆఫర్ ఇస్తారంటే ఎగిరి గంతేస్తారు. కానీ.. ఇక్కడ ఓ మెళిక ఉందండోయ్. ఆ మెళిక ఏంటి? ఈ ఆఫర్ ఎక్కడ ఇచ్చారు? ఎందుకు పెట్టారు? అనే పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం..
READ MORE: Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
Also Read
- Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
- Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
- Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
- Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
స్పెయిన్‌లోని సోరియా ప్రావిన్స్‌లో ఉన్న అరెనిల్లాస్ (Arenillas) అనే చిన్న గ్రామం జనవాసం లేక నిర్జన గ్రామంగా (Ghost Town) మారే పరిస్థితికి చేరుకుంటోంది. ఈ క్రమంలో గ్రామాన్ని కాపాడుకోవడానికి అక్కడి స్థానిక యంత్రాంగం ఓ వినూత్న, అందరినీ ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ఖాళీ అవుతున్న స్పెయిన్’ (Empty Spain) అనే కార్యక్రమంలో భాగంగా, ఇక్కడికి వచ్చి శాశ్వతంగా నివాసం ఉండే కుటుంబాలకు ఉచితంగా ఇల్లు, దాంతోపాటే ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక బలమైన సామాజిక లక్ష్యం ఉంది.
గత 50 ఏళ్లుగా యువత ఉపాధి కోసం నగరాలకు వలస వెళ్లడంతో అరెనిల్లాస్ లాంటి గ్రామాలు వెలవెలబోతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు, పాడుబడిన పాత డాక్టర్ క్లినిక్, పాత పాఠశాల భవనాలను ఆధునిక నివాసాలుగా మార్చిన గ్రామ కౌన్సిల్, ఒక అదృష్టవంత కుటుంబానికి ఈ ఇంట్లో అద్దె లేకుండా ఉండే అవకాశం కల్పిస్తోంది. అయితే, ఇక్కడ చేరే కుటుంబానికి రెండు కీలక బాధ్యతలు ఉంటాయి. ఒకటి, గ్రామంలోని ఏకైక సామాజిక కేంద్రమైన ‘సోషల్ బార్’ను నిర్వహించడం. రెండు గ్రామంలో జరిగే పునరుద్ధరణ పనులకు మున్సిపల్ మేస్త్రీగా సేవలు అందించడం. ఈ రెండు పనులు తప్పక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పనులు చేయడం వల్ల గ్రామంలోని మిగిలిన ప్రజలకు అవసరమైన సేవలు అందుతూ, ఆ ఊరు ఒక ‘ఎడారిలో సరస్సు’లా కళకళలాడుతుందని అక్కడి పాలనా వ్యవస్థ నమ్ముతోంది. అయితే.. ఇంత భారీ ఆఫర్ ప్రకటించినప్పటికీ.. ఇప్పటి వరకు కేవలం 100కు పైగా దరఖాస్తులు వచ్చాయి.
READ MORE: Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్
అంతేకాదు.. ఈ పథకం మీకు రావాలంటే మరికొన్ని నిబంధనలు తప్పనిసరి. అందులో మొదటిది, దరఖాస్తు చేసుకునే కుటుంబంలో పాఠశాలకు వెళ్లే వయసున్న పిల్లలు ఉండాలి. ఎందుకంటే, ఆ గ్రామంలో స్కూల్ మూతపడి చాలా ఏళ్లయింది. ప్రస్తుతం అక్కడ ఉన్న పిల్లలను 20 కిలోమీటర్ల దూరంలోని ‘బెర్లంగా డి డ్యూరో’ పాఠశాలకు పంపడానికి గ్రామ కౌన్సిల్ నిధులతో షటిల్ సర్వీస్ నడుపుతోంది. ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబం వస్తే, భవిష్యత్తులో ఈ విద్యా రవాణా వ్యవస్థను బలోపేతం చేయవచ్చని వారి ఆలోచన. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ గ్రామ కౌన్సిల్‌కు వీసాలు ఇచ్చే అధికారం లేదు. కాబట్టి, యూరప్ బయట నుంచి వచ్చే వారు దరఖాస్తు చేసుకోవాలంటే, అప్పటికే వారి వద్ద స్పెయిన్‌లో ఉండేందుకు చెల్లుబాటు అయ్యే నివాస, పని అనుమతి పత్రాలు (Residency and Work Permits) ఉండాలి. శిథిలావస్థకు చేరిన భవనాలను నివాసాలుగా మార్చి గ్రామాన్ని కాపాడుకుంటున్న అరెనిల్లాస్ మోడల్ ఇప్పుడు ఒక సక్సెస్ స్టోరీగా నిలిచింది. స్పెయిన్‌లోని వందలాది ఇతర గ్రామాలను కాపాడేందుకు ప్రాంతీయ ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని ఒక కేస్ స్టడీగా పరిశీలిస్తున్నాయి.
తాజావార్తలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
-
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
-
Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్.. బీఆర్ఎస్ తీరుపై అసంతృప్తి
-
Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్‌పై కేసు!
-
Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!