Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!
- రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్ సీక్రెట్
- తక్కువ పదార్థాలతో సూపర్ టేస్ట్ – ఏమేం కావాలి?
- 20 నిమిషాల్లో తయారీ… స్టెప్ బై స్టెప్ విధానం
- జ్యూసీ, క్రిస్పీ టేస్ట్ కోసం చిన్న చిట్కాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చికెన్ ప్రియులకు ‘స్టార్టర్స్’ అంటే ప్రాణం. అందులోనూ వెల్లుల్లి సువాసనతో, వెన్నలో వేగిన జ్యూసీ చికెన్ ముక్కలు ఉంటే ఆ మజానే వేరు. సాధారణంగా హోటళ్లలో దొరికే ఈ గార్లిక్ బటర్ చికెన్‌ను ఇంట్లోనే అందుబాటులో ఉన్న పదార్థాలతో కేవలం 20-30 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు:
ముందుగా ఈ వంటకానికి అర కిలో బోన్‌లెస్ చికెన్ ముక్కలను తీసుకోవాలి. వీటితో పాటు 3-4 టేబుల్ స్పూన్ల వెన్న (Butter), రెండు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రెండు స్పూన్ల మైదా పిండి, తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర , నిమ్మరసం సిద్ధం చేసుకోవాలి.
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
LPG Gas: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై మరో బిగ్ అప్‌డేట్..
తయారీ విధానం:
ముందుగా శుభ్రం చేసిన చికెన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఆపై వాటిపై మైదా పిండిని చల్లి ముక్కలన్నింటికీ సమానంగా కోటింగ్ ఇవ్వాలి. ఇది చికెన్ ముక్కలు పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండటానికి సహాయపడుతుంది.
ఒక పాన్‌లో కొద్దిగా నూనె , ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసి వేడి చేయాలి. మైదా కోటింగ్ ఉన్న చికెన్ ముక్కలను అందులో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో మిగిలిన వెన్న వేసి, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలను వేయించాలి. వెల్లుల్లి పచ్చి వాసన పోయి మంచి సువాసన వస్తున్నప్పుడు, కొద్దిగా నీరు పోసి సాస్ లాగా తయారయ్యే వరకు ఉడికించాలి.
Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!
చివరగా, ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఈ గార్లిక్ సాస్‌లో వేసి 2-3 నిమిషాల పాటు బాగా కలపాలి. సాస్ అంతా ముక్కలకు పట్టిన తర్వాత నిమ్మరసం , సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే అదిరిపోయే ‘గార్లిక్ బటర్ చికెన్’ రెడీ!
చిన్న చిట్కా:
చికెన్ ముక్కలను మరీ ఎక్కువగా వేయించకూడదు, అలా చేస్తే ముక్కలు గట్టిగా మారుతాయి. వెన్న నాణ్యమైనది వాడితే రుచి రెట్టింపు అవుతుంది. ఈ వంటకాన్ని వేడివేడిగా సర్వ్ చేస్తే వెల్లుల్లి సువాసనతో అదిరిపోయే రుచిని ఇస్తుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!