తగలబడుతున్న రష్యా.. చమురు శుద్ధి ఫ్యాక్టరీలే ఉక్రెయిన్ టార్గెట్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం ఒకవైపు ముమ్మరంగా ప్రయత్నాలు జరుతుంటే.. మరోవైపు ఈ రెండు దేశాలు ఒకదానిపై మరొకటి దాడులు చేసుకుంటునే ఉన్నాయి. మాస్కో-కీవ్‌ల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి 24 నుండి కొనసాగుతోంది. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య వివాదం తీవ్రమైంది. ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ – రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అలాస్కాలో యుద్ధాన్ని ముగించడానికి సమావేశమయ్యారు. తర్వాత ట్రంప్ ఆగస్టు 18న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వైట్ హౌస్‌లో సమావేశం అయ్యారు.
దేవుడు మంచి డిజైనర్.. నేచర్ మంచి గురువు.. మనం మంచి స్టూడెంటా కాదా అనేది ప్రశ్న
హైదరాబాద్‌లో జరిగిన బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య ప్రసంగం చేశారు. జీవవిజ్ఞానం, వైద్య రంగం, ఆవిష్కరణల ప్రాధాన్యం గురించి ఆయన విశ్లేషిస్తూ తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. “దేవుడు ఒక మంచి డిజైనర్, ప్రకృతి మంచి గురువు. మనం మంచి విద్యార్థులమా కాదా అనేది ప్రశ్న,” అని సీఎం రేవంత్ అన్నారు. జీవశాస్త్రం, వైద్య రంగంలో ప్రకృతినే మనకు ఉత్తమ గురువుగా తీసుకోవాలని, మనం చేసే పరిశోధనల్లో తప్పులు చేయకుండా ముందుకు సాగాలని సూచించారు. కృత్రిమ మేధస్సు (AI) కూడా బయోడిజైన్‌కు మంచి ఉదాహరణ అని, సహజ మెదడును ఆధారంగా తీసుకుని మానవులు కృత్రిమ మెదడును సృష్టించారని తెలిపారు.
మంజుమ్మల్ బాయ్స్ మూవీ సీన్ రిపీట్.. పెనుకొండ కొండమీదికి వెళ్లి రీల్స్ చేస్తూ పడిపోయిన పర్యాటకుడు..
మంజుమ్మల్ బాయ్స్ మూవీ సీన్ రిపీట్ అయ్యింది. ఈ సినిమాలో ఫ్రెండ్స్ అంతా కలిసి కొడైకెనాల్ ట్రిప్ కు వెళ్తారు. అక్కడ అందమైన ప్రదేశాలను చూసి చివరకు గుణ కేవ్స్ ను చూసేందుకు వెళ్తారు. ఈ క్రమంలో సుభాష్ అనే వ్యక్తి 150 అడుగుల లోతైన లోయలో పడిపోతాడు. తమ స్నేహితుడిని రక్షించుకునేందుకు మిగిలిన స్నేహితులు చేసే ప్రయత్నం స్నేహానికి ఉన్న విలువను చాటి చెప్పింది. ఇప్పుడు ఇదే తరహాలో ఓ పర్యాటకుడు పెనుకొండ కొండమీదికి వెళ్లి రీల్స్ చేస్తూ పడిపోయాడు. అధికారులు ఆ వ్యక్తిని రక్షించారు.
ఇస్రో సూపర్ సక్సెస్.. ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతం
భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఇస్రో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. గగన్‌యాన్ మిషన్ కోసం చాలా ముఖ్యమైన మొదటి ఎయిర్ డ్రాప్ టెస్ట్ (IADT-01)ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ పరీక్షలో పారాచూట్ ఆధారిత వ్యవస్థ సామర్థ్యాన్ని పరీక్షించారు. దీంతో అంతరిక్షం నుంచి తిరిగి వచ్చేటప్పుడు భారతీయ వ్యోమగాములు సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేలా చూసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కేసులు.. ధరలు పెంచి అమ్మిన వారిపై కఠిన చర్యలు
ఏపీలోయూరియా లభ్యత, సరఫరాపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, వ్యవసాయశాఖ, విజిలెన్స్ అధికారులు తో కీలక సమీక్ష చేశారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై సీఎం ఆర తీశారు..విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు సీఎం చంద్రబాబు.. యూరియా ఎరువుల నిల్వలు తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏపీ సీఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులకు సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు. యూరియా, ఎరువుల స్టాక్ చెకింగ్ చేపట్టాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రేపటి నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది. రేపటి నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఆయా రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులకు అందజేయనున్నారు. మొదటి విడత లో రేపటి నుంచి 9 జిల్లాల్లో కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ చేయనున్నారు. రెండో విడత ఈ నెల 30 నుంచి 4 జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు.
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సుప్రీంకోర్టులో వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే న్యాయ నిపుణులను సంప్రదించి వ్యూహరచన చేపట్టాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. రేపటి ఢిల్లీ పర్యటనలో ఈ భేటీ కీలకమవనుంది.
గౌరవప్రదమైన వీడ్కోలు ఇచ్చి ఉండాల్సింది.. పుజారా రిటైర్మెంట్ పై శశి థరూర్ భావోద్వేగ పోస్ట్
చెతేశ్వర్ పుజారా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉండటం మరియు సెలెక్టర్లు పట్టించుకోకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల పుజారా 103 టెస్ట్ మ్యాచ్‌లు, 5 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. పుజారా చివరిసారిగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (2023)లో భారత్ తరపున ఆడాడు. చెతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ తర్వాత, కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ఎంపీ శశి థరూర్ ఒక భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. చెతేశ్వర్ పుజారా వంటి తెలివైన టెస్ట్ బ్యాట్స్‌మన్‌కు గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాల్సిందని థరూర్ అన్నారు.
టెన్షన్.. టెన్షన్.. దారి మళ్లిన సీఎం ప్రయాణిస్తున్న విమానం..
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. సీఎంఓ అందించిన సమాచారం ప్రకారం.. ఇండిగో విమానం దిబ్రుగఢ్ నుంచి గౌహతికి వెళుతోంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని అగర్తలాకు మళ్లించారు. దీంతో కొంత సేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం విమానంలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నారని చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ట్రంప్‌కు ఏమైంది.. ప్రపంచం నుంచి ఆయన ఏం దాచిపెడుతున్నారు..
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్‌కు 80 ఏళ్లు నిండబోతున్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయన ఈ వయసులో కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కానీ ఆయన అభిమానులు మాత్రం ఓ విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఆయన ఏమైంది, ప్రపంచం నుంచి ట్రంప్ ఏం దాచి పెట్టాలని చూస్తున్నారని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రంప్ చేతికి ఏమైందనేది వైరల్ అవుతోంది. ఇటీవల ట్రంప్ చేతిపై మందపాటి మేకప్ పొర కనిపించింది. దీంతో ఒక్కసారి ఆయన ఆరోగ్యంపై దేశ ప్రజలు, ముఖ్యంగా ట్రంప్ మద్దతుదారులు ఆందోళన చేందుతున్నారు. అసలు ట్రంప్‌కు ఏమైందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..