డ్రగ్ పెడ్లర్ టోనీ ఐదు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు పోలీసు అధికారులు విచారణ చేయనున్నారు. ఐదవ రోజు విచారణలో భాగంగా వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ & నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధ కిషన్, సీఐ నాగేశ్వర రావు లు రంగంలోకి దిగనున్నారు. టోనీ వాట్స్ అప్ లో ఆరుగురు హైదరాబాద్ కు చెందిన వ్యాపారులు, పది మంది ముంబాయి,పూణే వారీ వివరాలపై అరా తీయనున్నారు. ఇప్పటికే విచారణలో గడిచిన నాలుగు రోజులుగా అనేక విషయాలను టోనీ వెల్లడించాడు. తన ఏజెంట్స్ ఇమ్రాన్ బాబు షేక్, అల్తాఫ్ ద్వారా, కొరియర్ బాయ్ ద్వారా 10గ్రాముల నుండి 50గ్రాముల కొకైన్ హైదరాబాద్ కు కోడ్ భాషలో చేరవేశానని టోనీ ఇప్పటికే తెలిపాడు. నెట్వర్క్, డ్రగ్స్ సరఫరా, డ్రగ్స్ ఎక్కడ నిల్వచేసేవారు వాటి లావాదేవీలు పై ఈ రోజు కూడా పోలీసులు ఆరా తీయనున్నారు.
పూణేలో ఖరీదైన పబ్ లో టోనీ కొకైన్ సరఫరా చేసినట్లు ఆధారాలు లభించడంతో దానిపైన కూడా విచారించనున్నారు. టోనీ గడిచిన నాలుగు నెలలుగా లక్షల్లో మనీ లావాదేవీలు జరిగినట్లు ఆధారాలను పోలీసులు సేకరించారు. టోనీ లావాదేవీలు జరిపిన అనంతరం భారీ మొత్తంలో నగదును నైజీరియా దేశానికి హవాలా మార్గంగా తరలించాడా..? అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ కు గడిచిన కొద్ది రోజులుగా లక్షల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ఎలా నిలువ చేసేవాడని టోనీ ని పోలీసులు విచారించనున్నారు. టోనీ జాబితాలో 40కిపైగా నిందితులు ఉన్నట్లు ఆధారాలు లభించాయని, లావాదేవీలు, డ్రగ్స్ సరఫరా వ్యాపారులతో లింక్స్, ఎజెంట్, కొరియర్ లింక్స్ పూణే, ముంబాయి మెట్రో సిటీ లో పబ్స్ ఈవెంట్స్ పై పోలీసులు ఆరా తీయనున్నారు. స్టార్ భాయ్ తో టోనీ లింక్స్ పై కూడా పోలీసులు విచారించనున్నారు.