IT Enquiry: నేడు ఐటీ ముందుకు మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Officials Questioning Second Day On Malla Reddy Assets: మంత్రి మల్లారెడ్డి పై సోదాల కేసులో ఐటీశాఖ విచారణ ముమ్మరం కొనసాగతుంది. రెండో రోజు ఆదాయపన్ను శాఖ అధికారులు చేపట్టిన విచారణ ముగిసింది. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇవాళ మరోసారి విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఐటీ అధికారులు ఇద్దరికీ నమూనా ప్రతాలు ఇచ్చారు. నిర్దేశించిన సమాచారాన్ని సమర్పించాలని ఆదాయపు పన్నుశాఖ అధికారులు సూచించారు.
నిన్న ఐటీ అధికారుల ఎదుట 9 మంది హాజరుకాగా.. మల్లారెడ్డి ఆడిటర్ సీతారామయ్య సహా కళాశాలకు చెందిన సిబ్బందిని అధికారులు విచారించారు.మల్లారెడ్డి విద్యాసంస్థల అకౌంటెంట్లను ఐటీ అధికారులు ప్రశ్నించారు. సోదాల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న దస్త్రాలు, నగదు, హార్డ్ డిస్క్ లకు సంబంధించిన విషయాలపై ఈరోజు హాజరైన వారిని ప్రశ్నించారు. అంతేకాకుండా.. విద్యా సంస్థలకు చెందిన ఆదాయ వ్యయాలతో పాటు పన్ను చెల్లింపునకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. వీళ్లను ప్రశ్నించి సమాచారం సేకరించిన ఐటీ దీని ఆధారంగా మరికొంత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
Read also: IND Vs NZ: మూడో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా గెలిచి సమం చేసేనా?
అయితే మొదటి రోజు మల్లారెడ్డి కుటుంబ సభ్యులతోపాటు ఆయన విద్యాసంస్థల సిబ్బందిని అధికారులు విచారించారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డి, కుమారుడు భద్రారెడ్డి, మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డిని ప్రశ్నించిన విషయం తెలిసింది. లక్ష్మారెడ్డి వెంటనే వెళ్లిపోగా మిగిలిన వారిని 6 గంటలపాటు విచారించారు ఐటీ అధికారలు. వీరితో పాటు మల్లారెడ్డి బంధువైన నర్సింహారెడ్డి,అతని కుమారుడు త్రిశూల్ రెడ్డిలను సైతం ప్రశ్నించారు. ఈ విచారణపై మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తాము సమాధానాలు చెప్పామని, ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు కేటాయింపులపై విచారణ చేశారని అన్నారు. అవసరమైతే తాము మరోసారి కూడా విచారణకు రావాలని ఐటి అధికారులు సూచించారన్నారు. తమ ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలపై విచారణ చేశారని, తాము చెప్పిన సమాధానాలతో వాళ్లు సంతృప్తి చెంది ఉంటారని చెప్పారు.
IT Enquiry: నేడు ఐటీ ముందుకు మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!